గుంతకల్ ( జనస్వరం ) : పట్టణంలో కాయగూరల మార్కెట్ దగ్గర వినాయక చవితిని పురస్కరించుకుని పర్యావరణాన్ని పరిరక్షించాలనే ముఖ్య ఉద్దేశంతో కాపు సంక్షేమ సేన ఆధ్వర్యంలో బలిజ సంఘీయుల సహకారంతో బుర్ర అఖిల్ రాయల్ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ, భాష్యం స్కూల్ ప్రిన్సిపల్ శ్రీమతి భార్గవి ముఖ్య అతిథులుగా మట్టి వినాయకుల ప్రతిమల పంపిణీ కార్యక్రమం పెద్దఎత్తున జరిగింది. ఈ సందర్భంగా జనసేన నాయకులు వాసగిరి మణికంఠ మాట్లాడుతూ పర్యావరణ హితం కోసం ప్రజలందరూ బాధ్యతగా వ్యవహరిస్తూ వినాయక చవితి పర్వదినాన మట్టి వినాయకులను ప్రతిష్టించి పూజలు నిర్వహించి నిమజ్జనం చేయాలని దానివల్ల నీటి కాలుష్యాన్ని, వాతావరణ కాలుష్యాన్ని నివారించిన వారవుతారని కావున ఈ పండుగలో మట్టి వినాయకుడినే పూజించాలని దీనివల్ల సాంప్రదాయాన్ని పాటించిన వారవుతామని, ఈ వినాయక చవితి నుండి ప్రజలందరికీ శుభాలు కలుగజేయాలని ఆ విఘ్నపతిని కోరుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాపు సంక్షేమసేన నాయకులు మోహన్ రాయల్, గాజుల రఘు, కసాపురం నంద బిజెపి సీనియర్ నాయకులు పట్నం రామాంజనేయులు పట్టణ చిరంజీవి యువత అధ్యక్షుడు పాండు కుమార్, వీరాంజనేయులు, పవన్, రాజేష్, ప్రవీణ్, అరవింద్, రాము, అనిల్ కుమార్, శ్రీనివాసులు పట్టణ ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.