నెల్లూరు ( జనస్వరం ) : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం నిర్విరామంగా 105వ రోజున 13వ డివిజన్, మిట్టపాలెం, బలిజపాలెం ప్రాంతాల్లోజరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికీ వెళ్ళి ప్రజాసమస్యల అధ్యయనం చేసిన కేతంరెడ్డి ఆ సమస్యల పట్ల తమవంతు పోరాటం చేస్తామని ప్రజలకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ రెండు రోజుల్లో జరగనున్న వినాయచవితి పండుగ రోజున ప్రతి ఒక్కరం బంక మట్టితో తయారు చేసిన ప్రతిమలనే పూజిద్దామని అన్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేసే ప్రతిమలతో పర్యావరణానికి ముప్పు అని తెలిపారు. బంకమట్టిలో విత్తనాలు నాటితే మొక్కలుగా పెరుగుతాయని, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ కు ఇలా జీవాన్ని ఇచ్చే గుణం లేదని, కనుక సకల శుభాలు కలగాలంటే బంకమట్టితో తయారు చేసే విగ్రహాలనే ఆరాధిద్దాం అని కేతంరెడ్డి వినోద్ రెడ్డి ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com