Logo
Date of Publish : 28 August 2022, 4:16 pm
Editor : Sake Naresh

మట్టిగణపతినే పూజిద్దాం – పర్యావరణాన్ని కాపాడుదాం : జనసేన నాయకులు త్యాడ రామకృష్ణారావు(బాలు)

● పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా మట్టివినాయక ప్రతిమలు పంపిణీ చేపట్టిన జనసేన నాయకులు

      విజయనగరం, (జనస్వరం) : జనసేన పార్టీ & విజయనగరం జిల్లా చిరంజీవి యువత ఆధ్వర్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం స్థానిక కంటోన్మెంట్, శ్రీ బాలాజీ టెక్స్ టైల్ మార్కెట్ వద్ద పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు త్యాడ రామకృష్ణారావు(బాలు) ఆధ్వర్యంలో సుమారు మూడువందలు మట్టివినాయక ప్రతిమలను పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేనపార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా, పార్టీ ముఖ్యమైన సిద్దంతమైన పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతీయేటా మట్టివినాయక ప్రతిమలను పంచుతున్నామని, అందులో భాగంగానే పంచిపెట్టామని, ప్రజలందరూ ప్లాస్ట్ ఆఫ్ పారీస్ విగ్రహాలను పూజించకుండా మట్టివినాయక ప్రతిమలనే వాడి, పర్యావరణ పరిరక్షణకు అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా చిరంజీవి యువత ప్రతినిధులు, జనసేనపార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ ఎస్. మురళీమోహన్, పిడుగు సతీష్, అంజనీపుత్ర చిరంజీవి ప్రజాసేవాసంఘం అధ్యక్షులు కొయ్యాన లక్ష్మణ్ యాదవ్, కార్యదర్శి, జనసేన యువనాయకుడు లోపింటి కళ్యాణ్, జనసేన యువనాయకులు పత్రి సాయికుమార్, అల్లబోయిన శివ గణేష్ కృష్ణ, అప్పన్న, యాతపేట రవి, రవికుమార్ పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com