గుంటూరు ( జనస్వరం ) : పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా ఉండేలా ప్రతీ ఒక్కరూ మట్టి గణపతి ప్రతిమలనే పూజించాలని జనసేన పార్టీ నగర అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ అన్నారు. వినాయకచవితి పండుగ సందర్భంగా 18 వ డివిజన్ అధ్యక్షుడు శానం రమేష్ ఆధ్వర్యంలో ఆదివారం అడపా బజార్ సెంటర్లో మట్టి గణపతి ప్రతిమలను, పూజా విధాన పుస్తకాన్ని ఆయన ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నేరేళ్ళ సురేష్ మాట్లాడుతూ పాస్టర్ ఆఫ్ ప్యారిస్ రంగులతో తయారు చేసిన ప్రతిమలను వాడటం వల్ల పర్యావరణానికి నష్టం, జీవరాసులకు ప్రాణహాని కలుగుతుందన్నారు. ముందుతరాల వారి భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని కాలుష్యరహితంగా ఉండేలా పండుగను జరుపుకోవాలని ప్రజలను కోరారు. మట్టి గణపతిని పూజించేవారు సెల్ఫీ ఫోటోను కానీ వీడియోను కానీ సోషల్ మీడియా వేదికగా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని నేరేళ్ళ సురేష్ కోరారు. కార్యక్రమంలో కాపు నాయకులు దాసరి రాము, జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి, నగర ఉపాధ్యక్షుడు చింతా రాజు, ఎర్రబోతు వాసు, స్వరూప, బాలకృష్ణ, బందెల నవీన్, వంశీధర్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com