ఎమ్మిగనూరు ( జనస్వరం ) : నియోజకవర్గంలో ఉమ్మడి పార్టీలైన జనసేన టిడిపి బిజెపి పార్టీలు కలిసి బలపరిచిన అభ్యర్థి గెలుపు కోసమే పనిచేద్దామని జనసేన పార్టీ ఎమ్మిగనూరు నియోజక వర్గం ఇంఛార్జి రేఖగౌడ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బుధవారం రోజు కార్యకర్తల ఆహ్వానం మేరకు పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న రేఖగౌడ్ గొనెగండ్ల మండల పరిధిలోని కులుమాల గ్రామంలో మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ వ్యతిరేఖ ఓటు చిలకుడదనే ఏకైక లక్ష్యంతో మూడు పార్టీలు ఉమ్మడిగా కలిసి పొత్తులో భాగంగా ఎవరికి సీటు కేటాయించిన ఉమ్మడి జెండా అభ్యర్థి గెలుపు కోసం సైనికుల్లా పనిచేయాలని తెలిపారు. నియోజక వర్గంలో ఉమ్మడి పార్టీలు బలపరిచిన అభ్యర్థి గెలుపును ఆపలేరని అలాగే రాష్ట్రంలో ఉమ్మడి పార్టీల నూతన ప్రభుత్వ ఏర్పాటు కావడం తధ్యం అన్నారు. ఉపాధి, ఉద్యోగం, అభివృధి ఎజెండాతో పల్లె పల్లెలో కలిసి కట్టుగా పసుపు, కాషాయ, జనసైనికులు పనిచేయాలని తెలిపారు, త్వరలో జరిగే ఎన్నికల్లో ఊహించని విధంగా అధికార పార్టీకి ఇంటికే పరిమితం చేసేలా సంఘటితంగా యుద్ధం చేద్దామన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాయలసీమ జోన్ నాయకులు పవన్ కుమార్, నియోజక వర్గ నాయకులు గానిగ బాషా, కర్ణం రవి, షబ్బీర్, మండల నాయకులు మునిస్వామి, మాలిక్, రామంజినేయులు, భాస్కర్, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com