నెల్లూరు ( జనస్వరం ) : జనసేన పార్టీ నెల్లూరు సిటీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వేములపాటి అజయ్ గారి సూచనలతో వై సి పి నాయకుల ఉసిగొల్పులకు లొంగక కలిసి మెలిసి పనిచేస్తామని జనసేన పార్టీ మద్దతు తెలుపుతూ పొంగూరు నారాయణ గారిని వారి క్యాంప్ ఆఫీసులో కలిశారు. చిరంజీవి యువత నాయకులు,జనసేన నాయకులు ఈ రోజు కలసి జనసేన కార్యకర్తలు, చిరంజీవి యువత సిటీలో బలంగా ఉన్నారని కలసి అభ్యర్థి ఎవరైనా కూడా ప్రజా ప్రభుత్వం స్థాపించి విధంగా పని చేసేందుకు మేమందరం సిద్ధమని పొంగూరు నారాయణ గారికి తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా పొంగురు నారాయణ గారు మాట్లాడుతూ... రాష్ట్ర ప్రయోజనాల కోసం అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కష్టం లో ఉన్నపుడు చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర అభివృద్దే ధ్యేయంగా ముందుకు సాగుతున్న పార్టీ అధ్యక్షుల నిర్ణయానుసారం అభ్యర్థులు ఎవరైనా కూడా అందరం కలిసి ప్రజా ప్రభుత్వం స్థాపిద్దాం... ఎవరు ఎంత ఉసిగొలిపినా కూడా నేను గొడవలకు పోయేవాడిని కాదని నేను చేసిన అభివృద్ధి సమాధానం చెబుతుంది. సిటీలో ఎక్కడ తిరిగినా కూడా ప్రజా ప్రభుత్వానికి మద్దతు ఉంది. జనసేన తెలుగుదేశం కార్యకర్తలకు స్నేహపూరితమైన వాతావరణం ఉంది.ఇదే వాతావరణంతో ఎన్నికల్లో గెలుస్తామని
అని నారాయణ గారు తెలిపారు. నెల్లూరు సిటీలోని 28 డివిజన్లో చిరంజీవి యువత సభ్యులు అలాగే జనసేన కార్యకర్తలు కలిసి క్యాంపెయిన్ నిర్వహించేందుకు సిద్ధమని 3500 కోట్ల రూపాయలతో నెల్లూరు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దిన అనుభవగ్నులతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని...చిరంజీవి యువత మరియు జనసేన పార్టీ నాయకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నారాయణ గారితో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్,చిరంజీవి యువత రాష్ట్ర ఉపాధ్యక్షులుణజనసేన సీనియర్ నాయకులు ఏటూరి రవికుమార్, చిరంజీవి యువత జిల్లా అధ్యక్షులు ఈగి సురేష్, జనసేన పార్టీ సీనియర్ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి,గుర్రం కిషోర్,రామ్ చరణ్ యువత సిటీ అధ్యక్షుడు ప్రసాద్, జనసేన జిల్లా ఉపాధ్యక్షులు సుధీర్ బద్దిపూడి, జిల్లా కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, సిటీ కార్యదర్శి హేమచంద్ర యాదవ్, కార్పొరేషన్ సంయుక్త కార్యదర్శి చిన్న రాజా, నరసింహ,మౌనిష్ షాజహాన్, వర్షన్, వీర మహిళలు హైమావతి, కృష్ణవేణి, నాగరత్నం, రేణుక, హసీనా, భారతి తదితరులు పాల్గొన్నారు....
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com