
అనంతపురం ( జనస్వరం ) : జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన టిడిపి నాయకులు సమష్టిగా పని చేద్దాం.. సమర శంఖాన్ని పూరిద్దామని జనసేన అనంతపురము అర్బన్ నియోజకవర్గం ఇంచార్జ్ టి.సి.వరుణ్ గారు డివిజన్ స్థాయి నాయకులకు పిలుపునిచ్చారు. సోమవారం నగరంలోని పలు డివిజన్ నాయకులతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా టి.సి.వరుణ్ గారు మాట్లాడుతూ… క్షేత్రస్థాయిలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను తీసుకెళ్లడంతో పాటు జనసేన – టిడిపి ఉమ్మడి కార్యాచరణతో ముందుకెళ్లాలన్నారు. స్థానిక ప్రజల సమస్యలను తెలుసుకుని వారికి అన్ని విధాలుగా జనసేన అండగా ఉంటుందని భరోసా కల్పించాలన్నారు. మీకు అన్నివేళలా తాను అందుబాటులో ఉంటానని 2024 సార్వత్రి ఎన్నికల్లో జనసేన టిడిపి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని టి.సి.వరుణ్ గారు ఉద్బోధించారు. కార్యక్రమంలో నగర అధ్యక్షులు పొదిలి బాబురావు, జిల్లా కార్యదర్శులు కిరణ్ కుమార్, అవుకు విజయకుమార్, ముప్పూరి కృష్ణ, నగర ప్రధాన కార్యదర్శి హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు.