నెల్లూరు ( జనస్వరం ) : జనసేన పార్టీ నెల్లూరు సిటీ నియోజకవర్గ కార్యాలయంలో కాపు సంక్షేమ సేన నెల్లూరు జిల్లా నూతన వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన బెల్లపు వెంకట సుధా మాధవ్ గారి పరిచయ కార్యక్రమం జరిగిన అనంతరం కేతంరెడ్డి వినోద్ రెడ్డి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళల సమక్షంలో పూల మాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. కాపు, బలిజ, తెలగ సంఘాల జేఏసీ నాయకులు అరిగెల సాయిరాం గారు మాధవ్ గారిని పరిచయం చేస్తూ వారి ప్రస్థానాన్ని వివరించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ గతంలో జరిగినటువంటి పొరపాట్లు పునరావృతం కాకుండా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆచితూచి అడుగులు వేస్తున్నారని అన్నారు. అందులో భాగంగానే సమాజంలోని వివిధ వర్గాల ప్రజలకు చేరువయ్యేలా షణ్ముఖ వ్యూహాన్ని రూపొందించి తాను అధికారంలోకి వస్తే ఏ ఒక్క సామాజికవర్గం కూడా నష్టపోకుండా ప్రతిఒక్కరికి లబ్ధి కలిగేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారని అన్నారు. ఈ లక్ష్యాలు నెరవేరాలంటే రాష్ట్రంలో అధిక సంఖ్యలో నివసించే కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని పవన్ కళ్యాణ్ గారు తెల్పిన విషయాన్ని గుర్తుచేసారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాపులకు పెద్ద దిక్కుగా ఉన్న చేగొండి హరిరామజోగయ్య గారి సలహాలను, సూచనలను పవన్ కళ్యాణ్ గారు అనునిత్యం గౌరవిస్తుంటారని, హరిరామజోగయ్య గారి వంటి పెద్దల దిశానిర్దేశం తమకు ఓ సూచిక అని, నేడు ఆయన ఆశీస్సులతో జిల్లాలో కాపు సంక్షేమ సంఘానికి వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన సోదరులు బెల్లపు వెంకట సుధా మాధవ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామని అన్నారు. రానున్న ఎన్నికలను పవన్ కళ్యాణ్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని, పోటీ చేసిన ప్రతి చోటా గెలుపే లక్ష్యంగా వ్యూహాలు ఉండబోతున్నాయని అన్నారు. ఇటీవల నెల్లూరు జిల్లా నాయకులతో పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేసిన సమావేశంలో నెల్లూరులో గెలవడం తనకెంత ముఖ్యమో పవన్ కళ్యాణ్ గారు తెలిపారని, మనమందరం ఐక్యంగా పనిచేస్తే నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన జెండా ఎగరడం ఖాయమని, వేరే ఏ ఆలోచనలు లేకుండా కాపు, బలిజ సోదరులందరూ పవన్ కళ్యాణ్ గారి కోసం పని చేయాల్సిన సమయం ఆసన్నమైందని, ఈ పోరాటంలో అధికార పార్టీ నుండి ఎవరికి ఏ ఇబ్బందులు వచ్చినా తాను అండగా నిలబడతానని, అందరం కలిసికట్టుగా పనిచేసి నెల్లూరు సిటీ నియోజకవర్గాన్ని పవన్ కళ్యాణ్ గారికి బహుమతిగా ఇద్దామని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో అమంచర్ల శ్రీకాంత్, వెంకటేశ్వర్లు, శర్మ, కార్తిక్, అంచెల సారధి, హేమంత్ రాయల్, చైతన్య, సాయి, శ్రీకాంత్, వరప్రసాద్, నరసింహ, ప్రభాకర్, జఫర్, వెంకటేశ్వర్లు, వీరమహిళలు.. శిరీష రెడ్డి, సునంద, కుసుమ, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.