శేరిలింగంపల్లి ( జనస్వరం ) : జనసేన పార్టీ ఆధ్యర్యంలో శేరిలింగంపల్లి నియోజక వర్గంలో, నియోజకవర్గ ఇంచార్జ్ డా. మాధవరెడ్డి గారి నాయకత్వంలో పాదయాత్ర నిర్వహించటం జరిగింది. ఈ పాదయాత్రకు జనసేన రాష్ట్ర నాయకులు నేమూరి శంకర్ గౌడ్, గ్రేటర్ హైదరాబాద్ అద్యక్షులు రాధారం రాజలింగం, మరియు ఇతర రాష్ట్ర నాయకులు హాజరై మద్ధతు పలికి ఈ పాదయాత్ర సమయంలో ప్రజలు అనేక సమస్యలను మాధవరెడ్డి దృష్టికి తీసువచ్చారు. దానికి మాధవ రెడ్డి సానూకూలంగా స్పందించి జనసేన, అధికారంలోకి రాగానే స్థానికంగా మన విద్యార్థులకు కార్పోరేట్ స్థాయిలో ప్రభుత్వ కళాశాలలు ఏర్పాటు చేస్తామని, ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటికి చేరుస్తామని, మరియు అర్హులైన వారందరికీ, ప్రభుత్వ పధకాలను అందజేస్తామని, డబుల్ బెడ్ రూం ఇండ్లను అర్ర్హులైన వారికి కేటాయిస్తామని ప్రజలకు తెలియచేసారు. ఈ సందర్బంగా మాధవరెడ్డి మాట్లాడుతూ గతంలో కబ్జాకోరులు, కాంట్రాక్టర్లకు మీరు అవకాశం ఇచ్చారు. వారు అభివృద్ది పేరున ప్రభుత్వ భూములు కబ్జా చేసి ప్రజా ధనాన్ని కొల్లగొట్టి నియోజక వర్గ అభివృద్ది గాలికి వదిలేశారు అని విమర్శించారు. అదే విధంగా ప్రశ్నించే గుణాన్ని యువత అలవర్చుకోవాలని, ప్రశ్నేంచాలంటే ప్రజాస్వామ్య బద్దకంగా యువత అందరు ఓటుహక్కులను వినియోగించుకోవాలి. అతి పెద్ద మరియు అత్యధిక పన్నులు చెల్లిస్తున్న శేరిలింగం పల్లి నియోజకవర్గానికి అధిక నిధులు తీసుకువచ్చి, శేరిలింగంపల్లి నియోజవర్గాన్ని భారత దేశ పటంలోనే అగ్రగామి నియోజకవర్గంగా నిలబెట్టగలను అని అన్నారు. కావున శేరిలింగం పల్లి ప్రజానీకం అంతా కూడా ఈ సారి సార్వత్రిక ఎన్నికల్లో ఓటువేసేటప్పుడు రానున్న 25 సంవత్సరాల అభివృద్ధి మరియు రానున్న తరాల భవిష్యత్తును చూసి ఓటు వేయాలని అన్నారు. గాజు గ్లాసు గుర్తుకు ఓటువేసి జనసేన పార్టీ బలోపేతం చేయడానికి కృషి చేయాలని కోరారు, ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులతో పాటు జన సైనికులు, వీర మహిళలు, శేరిలింగం పల్లి నియోజకవర్గ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com