- ఏకవాక్య తీర్మానం చేసిన జనసేన తిరుపతి నియోజకవర్గ కమిటీ
- తిరుపతిలో అభ్యర్థి ఎవరైనా గెలిపించాల్సిందే
- తిరుపతి నియోజకవర్గ సమీక్షా సమావేశంలో జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్
తిరుపతి ( జనస్వరం ) : తిరుపతి అసెంబ్లీ సీటును గెలిచి పవన్ కళ్యాణ్ కు బహుమతిగా ఇస్తామన్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్. సోమవారం తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్ లో జరిగిన తిరుపతి నియోజకవర్గ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తిరుపతిలో జనసేన-టిడిపి అభ్యర్థిని గెలిపించాలని ఏకవాక్య తీర్మానం చేశారు. అనంతరం డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ తిరుపతి నియోజకవర్గంలో జనసేన పార్టీని బలోపేతం కావాలని కోరారు. డివిజన్ ఇన్ చార్జ్ లతో పాటు బూత్ కమిటీలు ఎన్నికలకు సన్నద్దం కావాలని పిలుపునిచ్చారు. క్షేత్ర స్థాయిలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలన్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఆలోచనలను, జనసేన సిద్దాంతాలను గడపగడపకూ తీసుకెళ్లాలన్నారు. టిడిపి నాయకులు, కేడర్ తో సఖ్యతగా ఉండాలని సూచించారు. ఎన్నికలకు సమయం చాలా తక్కువగా ఉన్నందువల్ల ప్రతి జనసేన కార్యకర్త... ఒక సైనికుడిగా పనిచేయాలన్నారు. బూత్ లలో ఓటర్ల వివరాలను గుర్తించి వారికి పార్టీ సిద్దాంతాలను వివరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఇంచార్జి కిరణ్ రాయల్, నగర అధ్యక్షులు రాజారెడ్డి, రాష్ట్ర, జిల్లా,నగర కార్యవర్గ సభ్యులు, వార్డ్ అధ్యక్షులు జనసైనికులు వీరామహిళలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com