
నెల్లూరు ( జనస్వరం ) : ఈనెల 15,16,17 తేదీల్లో మరోసారి రోడ్ల దుస్థితిపై జనసేన డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహిస్తోంది. రోడ్ల మరమ్మత్తుల కోసం కేటాయించిన వేల కోట్ల రూపాయలు దారి మల్లుతున్నాయని, సామాన్యుడి నుంచి వసూలు చేసే రోడ్ సెస్ ఏమైపోతుందని నెల్లూరు జనసేన జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ ప్రెస్ మీట్ లో అన్నారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని రోడ్లన్నీ గుంతలతో దెబ్బతిన్నాయి. మన రాష్ట్రంలో ప్రయాణించడానికి కనీస వసతులు లేవని అంతర్రాష్ట్ర రవాణా ఆసక్తి చూపడం లేదు. ఇతర రాష్ట్రాల నేతలు మన రాష్ట్రంలో మౌలిక వసతులు లేవని హేళన చేస్తూ మాట్లాడుతున్నారు. గాఢ నిద్రలో ఉన్న CM ని మేలుకొలుపుతామని అన్నారు. #GoodMorningCMSir అనే క్యాప్టన్ తో 15, 16, 17 డిజిటల్ ప్రచారంలో జనసేన నాయకులు కార్యకర్తలు మరియు సామాన్యులు కూడా పాల్గొని తమ రోడ్ల దుస్థితిని ప్రదర్శించాలని కోరారు. పన్నులు సెస్ ల రూపంలో వేల కోట్ల రూపాయలు వసూలు చేస్తున్న ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనలో విఫలం అయిందని అన్నారు. గతంలో నిర్మించిన రోడ్ల బకాయిలు కాంట్రాక్టర్ల కు చెల్లింపులు చేయలేదని, ఈ నెల 10వ తేదీలోపు 2వేల కోట్ల రూపాయల తో 32 వేల కి.మీ. అయితే 8 వేల కి.మీ. రోడ్లు మరమ్మతులు చేస్తాం అని ప్రగల్భాలు పలికింది వైసీపీ ప్రభుత్వం. కానీ ప్రతి చోటా గుంతల మయంగానే ఉంది. అధ్వాన్నంగా ఉన్న రోడ్ల వల్ల ప్రజలు ఆరోగ్య సమస్యలు తలెత్తున్నాయి. గతేడాది సెప్టెంబర్ 2వ తేదీన కార్యక్రమం నిర్వహించినపుడు సమయంలో తూ తూ మంత్రంగా రోడ్లు పూడ్చి చేతులు దులుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, అధికార ప్రతినిధి సుజయ్ బాబు, రాష్ట్ర కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు, అధికార ప్రతినిధి సుధీర్, ఉపాధ్యక్షుడు బద్దిపూడి సుదీర్, జిల్లా కార్యదర్శి రాజేష్, ఎస్వీ సుబ్బయ్య, రాష్ట్ర మహిళా నాయకురాలు విజయలక్ష్మి, జిల్లా కార్యదర్శి పసుపులేటి సుకన్య మరియు ఇతర ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.