రామచంద్రాపురం ( జనస్వరం ) : రామచంద్రపురం నియోజకవర్గం లో 6వ రోజు పర్యటన లో భాగంగా గంగవరం మండలం కుడుపూరు గ్రామ పర్యటన చేశారు. అర్ధరాత్రి అయినా చీకటిలో జనసైనికులు సెల్ టార్చ్ వేసుకుని మరి పర్యటిస్తూ... కుడుకూరు గ్రామ మహిళలు పోలిశెట్టి చంద్రశేఖర్ కు హారతులతో స్వాగతిస్తూ నీరాజనాలు అందించడం జరిగింది. గంగవరం మండల అధ్యక్షులు చిర్రా రాజకుమార్ గారి ఆధ్వర్యంలో గంగవరం మండలంలో "ఇంటింటికి జనసేన" అనే కార్యక్రమం ద్వారా బుధ వారం సాయంత్రం గంగవరం మండలం కుడుపూరు గ్రామంలో ఎంపీటీసీ నంది కోళ్ల వీర వెంకట నాగేంద్ర గారిని కలిసి 'ఇంటింటికి జనసేన' కార్యక్రమం ప్రారంభించి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్ధాంతాలు ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం నియోజకవర్గ, గంగవరం మండల జనసేననాయకులు, జనసైనికులు, జిల్లాకార్యదర్శులు, మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ కమిటీ అధ్యక్షులు, ఎంపీటీసీలు, సర్పంచులు, కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు, వీరమహిళలు అందరూ భారీ స్థాయిలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com