రామచంద్రపురం ( జనస్వరం ) : నియోజకవర్గ ఇంచార్జి పోలిశెట్టి చంద్రశేఖర్ మరియు కాజులూరు మండల అధ్యక్షులు బోండా వెంకన్న ఆధ్వర్యంలో కాజులూరు మండలంలో "ఇంటింటికి జనసేన" కార్యక్రమం 3 వ విడత కార్యక్రమం జరిగింది. నియోజకవర్గంలో 8వ రోజు పర్యటనలో భాగంగా ఈరోజు ఉప్పుమిల్లి గ్రామం mptc కొప్పిశెట్టి కృష్ణమూర్తితో కలిసి వినాయక గుడి దగ్గర నుండి 'ఇంటింటికి జనసేన' కార్యక్రమం ప్రారంభించి ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుంటూ వారికి జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదల పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్ధాంతాలు ప్రజలకు రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జి పోలిశెట్టి చంద్రశేఖర్ తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం నియోజకవర్గ, కాజులూరు మండల జనసేననాయకులు, జనసైనికులు, జిల్లాకార్యదర్శులు, మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ కమిటీఅధ్యక్షులు, ఎంపీటీసీలు, సర్పంచులు, కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు, జనసేన నాయకులు, జన సైనికులు పాల్గొనడం జరిగింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com