నూజీవీడు ( జనస్వరం ) : జగనన్న కి చెబుదాం అంటూ ప్రజలకి ముఖ్యమంత్రిగారు మీ ప్రాంతంలో సమస్యలు తన దృష్టికి తీసుకురమ్మని పిలుపునిచ్చిన సందర్బంగా నూజివీడు నియోజకవర్గ జనసేన నాయకులు పాశం నాగబాబు ముసునూరు మండల రమణక్కపేట గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం కోసం విజ్ఞప్తి చేశారు. వెంటనే ప్రభుత్వ యంత్రాంగం స్పందించి తమ పరిధిలో ఉన్న ఇంజనీర్ గారు సంబందిత రోడ్ల నిర్మాణం కోసం ఎస్టిమేట్లు వేసి పై పంచాయతీ రాజ్ శాఖ అధికారులకు పంపించడం జరిగిందని అన్నారు. పాశం నాగబాబు మాట్లాడుతూ ఇంకా భాధ్యత ఇక వైసిపి పార్టీ పైన, స్థానిక ఎమ్మెల్యే ప్రతాప్ గారి పైన ఉంది. ఈ మాత్రం చొరవ స్థానిక ఎమ్మెల్యేకి ఉండుంటే చింతలపూడి ఎత్తిపోతలు, మెడికల్ కాలేజ్, పారిశ్రమిక వాడ, నూజివీడు-విజయవాడ నాలుగు వరుసల రహదారిలాంటి పెద్ద పనులు ఎప్పుడో పూర్తయ్యేవి అని అన్నారు. కనీస చొరవ చూపని వారు, తమ ప్రాంత అభివృద్దికి, మౌళిక సదుపాయాల కల్పనకు చొరవ చూపనోళ్ళు, నోరు తెరిసి నిధులు అడిగి మంజురు చేయించుకోనోళ్ళు ఎమ్మెల్యేలు అయిపోతున్నారు కానీ ఆయా ప్రాంతాలు ఇప్పటికీ వెనుకబడే ఉండిపోతున్నాయని వాపోతున్నారు. ఇదే విధంగా నియోజకవర్గంలో స్థానిక జనసేన నాయకులతో కలిసి తమ సమస్యలు అధికారులకు తెలియచేయడం జరుగుతుందని తెలిపారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com