పాలకొండ ( జనస్వరం ) : వీరఘట్టం మండలం, నడుకూరు గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహానికి క్రియాశీలక వాలంటీర్ మత్స పుండరీకం పువ్వుల మాల వేసి నివాళులర్పించారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గాంధీ కి చెబుదాం - వైస్సార్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కావాలని, గాంధీ కి చెబుదాం - ప్రత్యేక హోదా సాధనలో వైస్సార్సీపీ విఫలమైందని, గాంధీ కి చెబుదాం - పోలవరం ప్రాజెక్టును నిర్మాణం పూర్తి కాలేదని, గాంధీ కి చెబుదాం - మెగా డి.ఏస్.స్సీ నోటిఫికేషన్ ఇవ్వలేదని, గాంధీ కి చెబుదాం - సి. పి.ఎస్ రద్దు చేయలేకపోయారని, గాంధీ కి చెబుదాం - జగన్ పాలనలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిచలేకపోయారని అని విగ్రహానికి చెప్పారు. మహాత్మా మన్నించు - జగన్ పాలన నుండి ఆంధ్రప్రదేశ్ ని రక్షించు. మహాత్మా గాంధీ చెవి వద్ద స్లోగన్ లు చెపుతూ జనసేన కార్యకర్తలు వినూత్నంగా కార్యక్రమంలో చేపట్టారు. ఈ కార్యక్రమంలో కలిపిల్లి సింహ చలం, చింత గోవర్ధన్ , వాన కైలాస్, మజ్జి శరత్, మత్స.హరి నారాయణ, బెజ్జిపురపు శంకర్రావు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com