ఆమదాలవలస, (జనస్వరం) : ఉపాధ్యాయులపై జరుగుతున్న అన్యాయంపై ఆమదాలవలస నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ పెడాడ రామ్మోహన్ రావు స్పందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొంతకాలంగా ఉపాధ్యాయులకు చదువు చెప్పనీయకుండా వేధింపులకు గురిచేస్తూ వాళ్లకి నానారకంగా చిత్ర హింసలు పెడుతున్నారని వాపోయారు. IMMS APP పేరుతో లేట్రిన్ రూములు, బాత్ రూములు ఫోటోలు తీయించడం, మధ్యాహ్న భోజనాలు ప్లేట్లు ఫోటోలు తీయించడం, Face Recognazation అంటూ ఉదయం సాయంత్రం App ల తో సమయం వృధా చేయించడం, Byju's App అనే ప్రైవేట్ కంపెనీ ప్రోత్సహించి ఉపాధ్యాయుల సామర్ధ్యాన్ని చులకన చేయడం నాడు - నేడు పేరుతో పైపై మెరుగులు తప్ప చేసింది ఏమీ లేదు కదా, టీచర్స్ ని ఇంకా పనివాళ్ళుగా కాంట్రాక్టర్లుగా మార్చడం, అన్ని సబ్జెక్టుల పుస్తకాలను పూర్తిగా ఇవ్వలేక భోధన్ని గందరగోళం చేయడం ఇలాంటి చిత్రహింసలు పెడుతూ ఉపాధ్యాయులను అభద్రతాభావంలోకి నెట్టేస్తున్న ప్రస్తుత పాలకుల అరాచకాలపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులంతా గుణపాఠం చెప్పాలని జనసేనపార్టీ మీకు అండదండగా ఉంటుందని తెలియజేశారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com