Logo
Date of Publish : 30 May 2022, 8:16 am
Editor : Sake Naresh

ఈ చెత్త ప్రభుత్వాన్ని తీసి చెత్తబుట్టలో వేద్దాం : జనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్

           నెల్లూరు ( జనస్వరం ) : నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ గారి అధ్యక్షతన నెల్లూరు జిల్లాలోని ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలతో పార్టీ కార్యాలయం వద్ద ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చెన్నారెడ్డి మనుక్రాంత్ మాట్లాడుతూ వైసిపి పాలనలో నరకయాతన అనుభవిస్తున్న ప్రజల సమస్యలపై పోరాడేందుకు జనసేన నాయకులు సిద్ధంగా ఉండాలని ఎల్లవేళలా 24/7 కార్యాలయంలో అందుబాటులో ఉంటానని అన్నారు. స్థానిక సమస్యలపై అందరం కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లుగా వైసీపీ వ్యతిరేక ఓట్లను చీలనివ్వకుండా ప్రతి ఒక్కరు పార్టీ కార్యాచరణను అనుసరంచి పనిచేయాలని జనసేనపార్టీలోని అన్ని వర్గాలను మెగా ఫ్యామిలీ అభిమానులను అనుసంధానం చేస్తూ ప్రణాలికలు రూపొందిస్తున్నామని అన్నారు. రానున్న ఎన్నికల్లో జనసేన జనసేన గెలుపే ధ్యేయంగా బూతుల కమిటీలు నిర్మాణం చేపట్టే విధంగా చర్యలు తీసుకోనేందుకు అందరూ కలిసిమెలిసి పనిచేయాలని, కష్టపడి పని చేసిన ప్రతి ఒక్కరికీ గౌరవ స్థానాలతో అలకరిస్తామని అన్నారు. అన్ని నియోజకవర్గాల్లో కూడా కేంద్ర కార్యాలయం సూచనలతో జనసేన పార్టీ విధానాలను ప్రతి గడపకి చేరే విధంగా ప్రణాళికలు చేపడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, అధికార ప్రతినిధి దుగ్గిసెట్టి సుజయ్ బాబు, రాష్ట్ర కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు, చప్పిడి శ్రీనివాస్ రెడ్డి, గుడి హరిరెడ్డి, గూడూరు వెంకటేశ్వర్లు, మహిళా కన్వీనర్ కోలా విజయలక్ష్మి, రవీంద్ర, రాము, మహేష్ శర్మ, ఫణిశర్మ, మున్వర్, రోసనూరు సోమశేఖర్, సిద్ధూ, రాధమ్మ, శరవణ, రాజా, అనుదీప్ రెడ్డి, సురాయపాలెం పవన్, మన్నేపల్లి పవన్, వనం పవన్, హేమచంద్ర మరియు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com