Logo
Date of Publish : 17 March 2023, 3:08 pm
Editor : Sake Naresh

పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబడదాం : చంద్రగిరి ముస్లిం జనసేన నాయకులు

          చంద్రగిరి ( జనస్వరం ) : చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో జనసేన పార్టీ కార్యాలయంలో ముస్లిం మైనారిటీ పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. ముస్లిం మైనారిటీల్లారా పవన్ కళ్యాణ్ గారి కి అండగా నిలబడుదాం, జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారు మనకి అండగా ఉంటారు, ముస్లిం మైనారిటీల అభివృద్ధి బాధ్యతని పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారని జనసేన నాయకులు సోహైల్, రహంతుల్లా, షాజహాన్, రిజ్వాన్, అహ్మద్, ఆసిఫ్, షాహుల్, మస్తాన్, ఆసిఫ్  తెలియజేశారు.  ఈనెల మార్చి 14న మచిలీపట్నంలో జనసేనపార్టీ పదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా  పవన్ కళ్యాణ్ గారు ముస్లింల గురించి ముస్లిం మైనార్టీల సందేహాలు గురించి వివరణ ఇవ్వడం జరిగింది. ముస్లింల పైన ప్రేమని చాటుకోవడం జరిగింది ప్రతి ముస్లిం కి అండగా ఉంటామని, ముస్లింల అభివృద్ధికి తోడ్పడుతానని పవన్ కళ్యాణ్ గారు పిలుపునివ్వడం జరిగింది. రానున్న 2024 ఎన్నికలలో ప్రతి ముస్లిం కుటుంబ సభ్యుడు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబడాలని మనవి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట పైన నిలబడే వ్యక్తి, నీతి నిజాయితీపరుడు,సేవా తత్పరుడు అలాంటి వ్యక్తి అధికారంలోకి వస్తే ప్రతి ముస్లిం కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది. చరిత్రలో చూసుకుంటే ప్రతి నాయకుడు కూడా ముస్లిం మైనారిటీలను ఒక ఓటు బ్యాంకు లాగా చూశారు తప్ప ముస్లింల అభివృద్ధికి తోడ్పడింది లేదు, కానీ మొదటిసారి ఒక వ్యక్తి నిజాయితీగా ముందుండి ముస్లిం మైనార్టీలను అభివృద్ధి వైపు నడిపిస్తానని వస్తున్నాడు. ఎన్నిసార్లు మోసపోతాం ఎంతవరకు మోసపోతాం ఒకసారి మోసపోతే అది మన తెలివి లేని తనం, పదే పదే మోసపోతే అది మన చేతకానితనం. ప్రతి ముస్లిం సోదరుడు కూడా మనస్సాక్షిగా ఆలోచించండి పవన్ కళ్యాణ్ గారిని ఆదరించండి గాజు గ్లాస్ కి ఓటేయండని జనసేన నాయకులు పిలుపునిచ్చారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com