Logo
Date of Publish : 14 July 2022, 3:12 pm
Editor : Sake Naresh

మాట తప్పని, మడమ తిప్పని, నిద్దుర పోయిన ముఖ్యమంత్రికి శుభోదయం పలుకుదాం : త్యాడ రామకృష్ణ

        విజయనగరం ( జనస్వరం ) : రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై మరోసారి జనసేన పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా విజయనగరం నియోజకవర్గంలో రోడ్లపై ఉన్న పాడైపోయిన గుంతలను ఫోటోలు తీసి సోషల్ మీడియా ద్వారా ప్రతీ జనసైనికులు ఈ నెల 15,16,17 తేదీల్లో #GoodMorningCMSir అని వ్రాసి పోస్ట్లు పెట్టాలని జనసేన పార్టీ సీనియర్ నాయకులు త్యాడ రామకృష్ణారావు (బాలు) గురువారం విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటన ద్వారా పిలుపునిచ్చారు. గతనెల ముఖ్యమంత్రి నిర్వహించిన మున్సిపల్ అధికారుల సమీక్షలో ఈ జులై నెల 15 నాటికి రోడ్లపై గుంతలు ఉండవని మీడియా ముఖంగా ప్రకటన ఇచ్చారు. ఈ మాటతప్పని, మడమ తిప్పని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రోడ్లు గుంతలు పూడుస్తామన్న సంగతి మరిచారని, నిద్దుర పోయిన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కి ఈ డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా సోషల్ మీడియా దద్దరిళ్ళేటట్లు తట్టిలేపాలని అన్నారు. విజయనగరం నియోజకవర్గంలోను, పట్టణంలోనూ రోడ్ల పరిస్థితి మరింత అద్దువానంగా మారిందని,ప్రజలంతా తీవ్రఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహారిస్తోందని, జనసేన పిలుపుతో ఈసారి ప్రతీజనసైనుకులు ప్రభుత్వానికి మేలుకొలపాలని అన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com