గాజువాక ( జనస్వరం ) : 4.8 సంవత్సరాలుగా నవ్యాంధ్రప్రదేశ్ దోచుకు తింటున్న జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉన్న వైసీపీ నాయకుల కుంభస్థలాల నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడటమే జనసేన అర్బన్ జిల్లా, జనసేన PAC సభ్యులు కోన తాతారావు, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి లక్ష్యమని విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక మాజీ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు కార్యకర్తలకు స్పష్టం చేశారు. గాజువాక నియోజవర్గ పార్టీ కార్యాలయంలో జనసేన – తెలుగుదేశం పార్టీ నాయకుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు జనసేన -తెలుగుదేశం పార్టీలో ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేశారు. సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ. ఈ రాష్ట్ర విశాల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు మరియు చంద్రబాబు నాయుడు గారు చారిత్రాత్మకమైన పొత్తుల నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఇరు పార్టీల వారు చంద్రబాబునాయుడు – పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని తీర్మానించారు. జిల్లా జనసేన అధ్యక్షులు కోన తాతారావు మాట్లాడుతూ.. అబద్దానికి అవినీతికి. విధ్వాంసాలకు కుట్రలకు ఈ దేశంలోనే జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్, నవ్యాంధ్రప్రదేశ్ ఉంది కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. ఇరు పార్టీలు కలిపి భవిష్యత్తు గ్యారెంటీ బాబు షూరిటీతోపాటు స్థానిక అంశాలు పైన పోరాటం చేయాలి తీర్మానించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ గాజువాక పరిశీలికుడు కిమిడి రామ్ మాలిక్ మాట్లాడుతూ. ఉత్తరాంధ్ర ఉత్తర కుమారులు ఈ వైసీపీ నాయకులు అని విమర్శించారు. ఈ సందర్భంగా వార్డుల్లో పార్టీలు సమైక్యపరచుకుంటూ వైసిపి ప్రజా వ్యతిరేక విధానాలు ఎండగట్టాలని తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర పార్టీ నాయకులు గడసాల అప్పారావు, తిప్పల వెంకటరమణారెడ్డి, జీవీఎంసీ జనసేన డెప్యుటీ ఫ్లోర్ లీడర దల్లి గోవింద్ రెడ్డి, గంధం వెంకట్రావు, గవర సోమ శేఖర్, లీగల్ సెల్ కరణం కళావతి, వీర మహిళ మాక శాలిని, తెలుగుదేశం గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు పుచ్చ విజయకుమార్, రాష్ట్ర పార్టీ కార్యదర్శులు బోండా జగన్, జీవీఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గంధం శ్రీనివాసరావు, 67 వార్డ్ కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు, 79 వార్డ్ కార్పొరేటర్ రౌత్ శ్రీనివాసరావు, మొళ్లి ముత్యాల నాయుడు. జిల్లా తెలుగు మహిళ అధ్యక్షురాలు ఎస్. అనంతలక్ష్మి. 75 వ వార్డ్ ఇంచార్జ్. పులి వెంకటరమణారెడ్డి జిల్లా తెలుగు యువత ప్రధాన కార్యదర్శి మోల్లే పెంట్రాజు.. అధిక సంఖ్యలో జనసేన టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు.