గుంటూరు ( జనస్వరం ) : రాష్ట్రం గత ఐదేళ్లుగా జగణాసురుడు అనే రాక్షసుడి గుప్పిట్లో చిక్కి విలవిలాడుతోందని , జగణాసురిడి బారినుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీఒక్కరిపై ఉందని మాజీమంత్రి , టీడీపీ నాయకులు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఈ నెల 28 న తాడేపల్లిగూడెంలో టీడీపీ , జనసేన పార్టీల ఆధ్వర్యంలో జరగనున్న భారీ బహిరంగ సభకు ప్రజాస్వామ్య వాదులంతా తరలిరావాలని ఆయన కోరారు. శనివారం జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి ఆధ్వర్యంలో రూపొందించిన ఛలో తాడేపల్లిగూడెం గోడప్రతులను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లు పాల్గొనే ఈ సభ రాష్ట్ర గతిని మారుస్తుంన్నారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చేస్తున్న అరాచకాలు , అక్రమాల నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేసేందుకు ఒక్కటిగా ముందుకు సాగుతున్న చంద్రబాబు , పవన్ కల్యాణ్ లకు ప్రజలంతా అండగా నిలవాలని కోరారు. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలు వాక్ స్వంతత్ర్యాన్ని , భావ ప్రకటన స్వేచ్ఛను కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశం అంతా అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతుందని రాష్ట్రంలో మాత్రం జగన్ అరాచక రాజ్యాంగం అమలవుతుందని ధ్వజమెత్తారు. వైసీపీ నేతల దాష్టీకాలను , దౌర్జన్యాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తూ ప్రజల్ని , ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రం అత్యంత ప్రమాదకర స్థితిలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు విజన్ , పవన్ కల్యాణ్ పోరాట స్ఫూర్తి రాష్ట్రానికి శ్రీరామరక్షగా నిలుస్తున్నాయన్నారు. మేధావులు , సంఘ సంస్కర్తలు ఏకతాటిపైకి వచ్చి ప్రజాస్వామ్య పరిరక్షణకై కలిసి వారితో నడవాలని కోరారు. రాష్ట్ర నలుమూలల నుంచి తాడేపల్లిగూడెంలో జరగబోయే సభకు టీడీపీ శ్రేణులు , జనసైనికులు తరలిరావాలని కన్నా లక్ష్మీనారాయణ కోరారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు తాళ్ళ వెంకటేష్ , జనసేన పార్టీ నాయకులు సయ్యద్ షర్ఫుద్దీన్, గడ్డం రోశయ్య, కొలసాని బాలకృష్ణ, నండూరి స్వామి, స్టూడియో బాలాజీ, బాలు, నాజర్ వలి తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com