పాలకొండ, (జనస్వరం) : ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా, పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండలం జనసేనపార్టీ క్రియాశీలక సభ్యత్వ వాలంటీర్ మత్స పుండరీకం నాలుగేళ్ళ వైస్సార్సీపీ పాలనపై మీడియాతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాటతప్పం మడం తిప్పం అంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే వృధ్యాప్య పింఛన్ దశల వారిగా పెంచుతామని మాట తప్పారు. సంపూర్ణ మద్యపానం నిషేదిస్తామని చెప్పి జె బ్రాండ్ మద్యం అమ్మిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని అన్నారు. సహజ వనరులను (ఇసుక, మైనింగ్, భూమి,) కబ్జా చేస్తున్నది వైస్సార్సీపీ నాయకులే కదా అని ప్రశ్నించారు. రెండేళ్లలో పూర్తి చేస్తానన్న మీ సొంత జిల్లా కడప ఉక్కుపరిశ్రమని నాలుగేలు అయ్యిన పూర్తి చేయలేదు ఎందుకు? అధికారంలోకి వచ్చిన వారంలో రద్దు చేస్తానన్న సిపిఎస్ ని మీ నాలుగేళ్ళ పాలనలో ఇంకా వారం రోజులు కాలేదా అని ప్రశ్నించారు. పరుగులు పెట్టిస్తానన్న పోలవరం, అమరావతిని నాలుగేళ్ళ పాలనలో పడకేసిది ఎందుకు? ప్రతి సంవత్సరం జనవరిలో విడుదల చేస్తానన్న జాబ్ క్యాలెండర్ ఏది? అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే తీస్తానన్న మెగా డీఎస్సీ ఇంతవరకు ఎందుకు తియ్యలేదు? అగ్రిగోల్డ్ బాధితులకు మొదటి సంవత్సరమే ఇస్తానన్న 1,150 కోట్లు ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదు? మూడు రాజధానులు పేరిట ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసున్నది జగన్ రెడ్డి నీవుకదా? కేంద్రం మెడలు వంచి సాధిస్తానున్న ప్రత్యేక హోదా ఈ నాలుగేళ్ళ లో ఎందుకు సాధించలేదు? రైతులకోసం చేస్తానన్న 3వేలకోట్లతో ధరల స్థిరీకరణనిధి ఎందుకు ఏర్పాటు చేయలేదు? విశాఖపట్నంలో ఋషి కొండని అక్రమాలకు పాల్పడిoది మీ నాయకులే కదా? ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి పనులు పేరిట, నిర్మాణాల పేరిట శంకుస్థాపనలు, శిలాఫలకలే మిగిలాయి తప్ప నిర్మాణాలు లేవు, అభివృద్ధి పేరుతో అక్రమ ఆస్తుల కూడగట్టుకొన్నావు, భారత దేశంలో ధనిక ముఖ్యమంత్రివి నీవే కదా జగన్ రెడ్డి. వాలంటీర్ లకు వందనం పేరిట ప్రజా ధనాన్ని వృధా చేస్తున్నది మీరు కదా? రాబోయే ఎన్నికల్లో గాజుగ్లాస్ గుర్తు వద్ద బట్టన్ నొక్కి – బటన్ రెడ్డి జగన్ సాగనంపేoదుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. రాబోయేది జనసేన ప్రభుత్వమని పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వడం తధ్యం అని మత్స పుండరీకం అన్నారు. ఈ కార్యక్రమంలో క్రియాశీలక సభ్యులు దండేల సతీష్, నవీన్ లు పాల్గొన్నారు.