Logo
Date of Publish : 25 April 2022, 5:05 pm
Editor : Sake Naresh

వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించుదాం : ఎచ్చర్ల జనసేన నాయకులు

                శ్రీకాకుళం ( జనస్వరం ) :  రాష్ట్రంలో అరాచకపాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం పాడాలని జనసేన రాష్ట్ర కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్ పిలుపునిచ్చారు. జి. సిగడాంలో ఎచ్ఛర్ల జనసేన వీరమహిళ కాంతి శ్రీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే జగన్ రెడ్డిని గద్దె దించాలని కోరారు. రాష్ట్రానికి అరిష్టం పట్టిందని, ఆ దరిద్రాన్ని వదిలించుకోవడానికి ముందుకు రావాలన్నారు. నిత్యావసర సరుకులు పెంచి సామాన్యుని నడ్డి విరుస్తున్న ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. రాష్ట్రాన్ని ఊబిలోకి ముంచిన ఘనత జగన్ రెడ్డిడే అన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని జనసైనికులకు పిలుపునిచ్చారు. తొలుత భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు, నిత్యావసర సరుకులు అంటాయని అన్నారు. రాబోయే రోజుల్లో వైసీపీ పార్టీకి బుద్ధి చెప్పే రోజులు వస్తాయన్నారు. ఎచ్ఛర్ల నియోజకవర్గ జనసేన వీరమహిళ మాట్లాడుతూ రాజకీయం డబ్బుతో ముడిపడిన వ్యవస్థ అని రాజకీయలవైపు కన్నెత్తి చూడలంటేనే భయపడేవారిని సైతం ఎంతో మంది యువకులకు ఆవకాశం కల్పించిన పార్టీ జనసేన అని అన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే యువతలో ప్రశ్నించేతత్వం రావాలని అప్పుడే అవినీతి జరగకుండా పారదర్శకంగా అభివృద్ది పనులు సక్రమంగా జరుగుతాయని తెలిపారు. నేటి వ్యవస్థ మార్పుకోసం జరుగుతున్న ఉద్యమాల్లో యువతరమే సింహాభాగంగా సాగుతుందని భావి భారత నిర్మాణం యువత చేతుల్లోనే ఉందని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎచ్ఛర్ల నియోజకవర్గ ఇంచార్జ్ నడికుదితి ఈశ్వరరావు, ఆముదాల వలస జనసేన ఇంచార్జ్ రామ్మోహన్ రావు, బూపతి అర్జున్ కుమార్, తాలబత్తుల పైడి రాజు, మీసాల రవికుమార్, మీసాల రామకృష్ణ, సందీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.  


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com