నిర్మల్, (జనస్వరం) : నిర్మల్ జిల్లా భైంసాలో దళిత బహుజన ఆధ్వర్యంలో కోనసీమ జిల్లాను అంబేద్కర్ జిల్లాగా మార్చి వెంటనే నామకరణం చేయాలని కోరుతూ అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం చేసి ర్యాలీగా బయలుదేరి RDO కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందరో ప్రముఖులు పేర్లతో జిల్లాలకు పేరు పెట్టారు. కానీ అంబేద్కర్ పేరు ప్రతిపాదన వచ్చే సరికి ఆంక్షలు విధించి అల్లర్లు సృష్టించి ప్రజల్లో ఆందోళన వాతావరణం చెలరేగేలా అంబేద్కర్ గారిని అవమాన పరిచిన అంబేద్కర్ వ్యతిరేఖ శక్తులను వెంటనే అరెస్ట్ చేసి అట్రాసిటీ కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. అంతటి మహనీయుడి పేరును పెట్టనివ్వకుండ అడ్డుపడితే ఈ దేశం నుండి వాళ్ళని తరిమికొట్టే రోజు దగ్గరలోనే ఉంది అని వారు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాం. లేని యెడల ప్రతి గ్రామం, మండలం, జిల్లా రాష్ట్ర కేంద్రాల్లో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు సుంకెట మహేష్ బాబు, దళిత బహుజన నాయకులు, భీమ్ డోoగ్రే, గౌతం పింగ్లే, గిరిధర్ జంగ్మే, సురేష్ శానే, చకేటి లస్మన్న, భీమ్ ఛంద్రే, మనోహర్, రాజు బిసి నాయకులు, సుంకెట పోషేట్టి, పులి ప్రతాప్, ముత్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com