జగ్గయ్యపేట, (జనస్వరం) : ఛలో విశాఖపట్నం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ జనసేన పార్టీ కృష్ణాజిల్లా ప్రధాన కార్యదర్శి బాడీశ మురళీకృష్ణ మీడియా సమావేశం నిర్వహించి మీడియా ముఖంగా తెలియజేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జనసేనపార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని తమ పోరాటానికి అండగా ఉండాలని సభలో పాల్గొనవలసిందిగా విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి విజ్ఞప్తి చేసింది. ఆ మేరకు 31 వ తేదీన పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం చేరుకొని అక్కడ నుంచి స్టీల్ ప్లాంట్ ప్రాంగణానికి చేరుకొని పరిరక్షణ సమితి ప్రతినిధులను కలిసి వారు నిర్వహించే సభలో పాల్గొంటారని, 31 వ తేదీ 2 గంటలకు సభ ప్రారంభం అవుతుంది. విశాఖ ఉక్కు ప్రైవేటికరణ నిలిపివేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి పోరాడుతుంది. ఈ అంశం పై ఆంధ్రప్రదేశ్ నుంచి తొలుత స్పందించి కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారే. ఫిబ్రవరి 9 వ తేదీన పవన్ కళ్యాణ్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాని కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ భావధ్వేగాలతో ముడిపడి ఉందని విషయాన్నీ కేంద్రానికి తెలియజేస్తూ, ఈ నిర్ణయంపై పునరాలోచన చేయాలనీ వినతిపత్రం అందజేయడం జరిగిందని తెలియజేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ అనేది రాష్ట్రానికి ఆజామాషిగా రాలేదని 34మంది ప్రాణత్యాగాలతో విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పాటైందని అమిత్ షాకి తెలియపరచడం జరిగిందని, కావున పవన్ కళ్యాణ్ మద్దతు తప్పకుండ ఉంటుందని తెలియజేస్తూ నియోజకవర్గంలోని జనసేన నాయకులు, వీరమహిళలు, పార్టీ శ్రేణులు పవన్ కళ్యాణ్ గారి పర్యటనలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మురళీకృష్ణ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు తునికిపాటిశివ, వై ఎన్ ఆర్, మాస్టర్ చైతన్య, గోపీచంద్, నాగరాజు, గోపీనాథ్ శంకర్, నాగరాజు, తిరుపతిరావు, నవీన్, నాగబాబు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com