28న ఛలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం రండి.. కదలిరండి : కొలసాని లక్ష్మీ పిలుపు
నివర్ తుఫాన్ బాధితులకు అండగా జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 28వ తేదీన సోమవారం “జై కిసాన్.. ఛలో కలెక్టరేట్” కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం రండి.. కదలిరండి అని పర్చూరు నియోజక వర్గ పరిధిలోని నూతలపాడు గ్రామానికి చెందిన జనసేన ఝాన్సీ వీరమహిళ కొలసాని లక్ష్మీ శ్రీనివాసరావు బుధవారం పిలుపునిచ్చారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మనందరికీ ఆకలితీర్చి అన్నంపెట్టే అన్నదాతలు ప్రకృతి విపత్తుల వలన అపార నష్టాలను చవిచూస్తూ అందివచ్చిన పంటలు చేతికి అందకుండా.. ఆర్థికంగా అధఃపాతాళానికి అణగదొక్కబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు సాగుకు చేసిన అప్పులు తీర్చే దారులు లేకుండా ఆపన్నహస్తం కోసం ఎదురుచూసి, విసిగి వేసారిపోయి పలువురు రైతులు అర్థాంతరంగా బలవన్మరణానికి సైతం ఒడిగట్టి తనువులు చాలించారని తెలిపారు. ఈనేపథ్యంలో జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ అన్నదాతలకు జనసేనపార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పదేపదే చెబుతూ “జై కిసాన్” కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని కొలసాని లక్ష్మీ వివరించారు. ఈనెల 7వతేదీన సైతం జనసేన పార్టీ శ్రేణులంతా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యవైఖరిని నిరశిస్తూ “రైతుదీక్ష” పవన్ కళ్యాణ్ తో సహా అందరూ చేపట్టడం, తహశీల్దార్ లకు వినతిపత్రాల్ని అందజేయడం జరిగిందన్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించక నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆమె దుయ్యబట్టారు.. ఈ నేపథ్యంలో ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ నిరసన ప్రదర్శనలు చేసి, ప్రతి జిల్లాలోని కలెక్టరేట్ లకు జనసైనికులు, రైతులు అందరూ తరలివెళ్లి జిల్లాకలెక్టర్ లకు మరోమారు వినతి పత్రాలను సమర్పించాలన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా “నివర్” తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులు, కౌలు రైతులకు ఎకరానికి రూ. 35 వేలు పరిహారం, రూ.10 వేలు తక్షణ సాయం అందించాలని కోరుతూ… అన్ని నియోజకవర్గాల నుండి, ఈనెల 28న ప్రతీ జిల్లాకలెక్టర్ కార్యాలయానికీ వెళ్ళి వినతి పత్రాలు అందించనున్నట్లు ఆమె వివరించారు. ఈ కార్యక్రమాన్ని ఆద్యంతం జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు, రైతులు అధికసంఖ్యలో పాల్గొని “ఛలోకలెక్టరేట్” కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కొలసాని లక్ష్మీ శ్రీనివాసరావు తెలిపారు. అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే రైతుల సమస్యల పరిష్కారం కోసం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఇంకా ఉధృతంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆమె హెచ్చరించారు.