అనంతపురం ( జనస్వరం ) : జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా.... మీ నిర్ణయాన్ని గౌరవిస్తాం, మీ వెనకే మీ అడుగుజాడల్లో నడుస్తామని అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు లాయర్ జయరాం అన్నారు. అకాల వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా రైతులంతా పూర్తిగా నష్టపోయారు, వైసిపి ప్రభుత్వం రైతుల్ని ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైంది. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రైతుల్ని రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో పరామర్శించారు రైతులు తమ కష్టాల్ని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి తెలియజేశారు. దీన్ని ఓర్చుకోలేక కొంతమంది వైసిపి మంత్రులు అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, జోగి రమేష్ లాంటివారు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. కొంతమంది వైసిపి నీలి కాపులు పేర్నేని నాని లాంటివారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గురించి విమర్శించడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినంక ఈ నాలుగేళ్ల కాలంలో రాష్ట్రం పూర్తిగా అంధకారంలోకి వెళ్లిపోయింది. సీఎం జగన్ రెడ్డి గారు వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలకు దిగుతూ, రాష్ట్రవ్యాప్తంగా దౌర్జన్యాలు, దాస్టికాలు పెరిగిపోయాయి, రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించి పోయాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినంక నాయకులు కేవలం దాచుకోవడం దోచుకోవడం తప్ప రాష్ట్ర ప్రజలకు వనకూరిందేమీ లేదు. వైసీపీ ప్రభుత్వం మరల అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ప్రజలు బతికే పరిస్థితులు లేవు కాబట్టి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షాలను కలుపుకొని వ్యతిరేకత ఓటు చీలకుండా ముందుకు వెళ్లాలని తీసుకున్న నిర్ణయాన్ని మేమందరు స్వాగతిస్తున్నాం. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్న, తన ఆసియా సాధన కోసం ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి ఎవరైతే సూచనలు సలహాలు ఇస్తున్నారో... మీకు చాతనైతే దమ్ము ధైర్యం ఉంటే జనసేన పార్టీలోకి వచ్చి జనసేన పార్టీ మనుగడు కోసం పని చేయండి, బయటనుంచి ఉచిత సలహాలు ఇవ్వద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నామని అన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి కుటుంబ వ్యక్తిగత విషయాలు మాట్లాడుతున్న గుడివాడ అమర్నాథ్ లాంటి వారి అందరికీ ఇదే హెచ్చరిక పాదరక్షకులే కాదు, బూట్లు, పరకలతో కొట్టడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాం. అధికార మదమెక్కి నోరు అద్దూ అదుపు లేకుండా మాట్లాడితే చూస్తూ ఊరుకోం పని హెచ్చరిస్తున్నామని అన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com