పాలకొల్లు ( జనస్వరం ) : ఎలమంచిలి మండలం దొడ్డిపట్ల గ్రామంలో ఇంటింటికి జనసేన ప్రచారం నిర్వహించారు. దగా పడిన దళిత జాతి దండు కట్టాలి దండెత్తాలి నినాదంతో జనసేన వీర మహిళలు ప్రచారం నిర్వహించారు. మనమంతా ఒకటై గెలవాలి సమాజం అనే ప్రతి దళితులకి ఈ నాలుగున్నర సంవత్సరాలలో దళితులపై జరిగినటువంటి దాడులను దారులను ప్రతి దళితులకే అర్థమయ్యే విధంగా చేస్తున్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి దళితుల ఓట్లని ఉపయోగించుకొని ఆయన ఎదుగుతున్నాడు తప్ప దళితులని మాత్రం రోడ్డుకి లాగేస్తున్నారన్నారు. ప్రశ్నిస్తున్న వాళ్ళని ఇంటికి డోర్ డెలివరీలు చేస్తూ కనీస గౌరవం కూడా ఇవ్వకుండా పక్షపాతం చూపిస్తున్నారు. 2024లో ఈ వైయస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు లేకుండా దళితులు సమాధానం ఇస్తారని పాలకొల్లు వీర మహిళలు అన్నారు. ఈ కార్యక్రమంలో మేడిచర్ల జ్యోతి, లలిత మాదాసు, బెల్లంకొండ విష్ణుకుమారి, దేవరపు ఝాన్సీ, బొడ్డు ప్రియాంక (రియా) తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com