Logo
Date of Publish : 22 November 2025, 7:49 pm
Editor : Sake Naresh

కామాటి వీధి సెంటర్ లో జనసేన జెండా ఎగురేద్దాం : గునుకుల కిషోర్

నెల్లూరు, అక్టోబర్ 22, (జనస్వరం) : నెల్లూరు సిటీ 47వ డివిజన్ లో కామాటి వీధి సెంటర్ వద్ద జనసేన జెండా ఎగురవేయడానికి జనసైనికులు సంకల్పించారు. సరదాగా నిర్వహించిన చాయ్ విత్ జనసైనిక్స్ కార్యక్రమంలో కార్యకర్తలు చేరికతో ఉత్సాహం నెలకొంది. జనసేన పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొనాలని 47వ డివిజన్ కు చెందిన పలువురు యువత ముందుకు వచ్చారు. కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలపై వేగంగా స్పందిస్తున్న తీరు ప్రజలకు వివరించి, ప్రతి గడపకు చేరుకుని ప్రజా సమస్యలకు అండగా నిలబడతామని నాయకులు ప్రకటించారు. ఈ సందర్భంగా 30 11 2025 న జరగనున్న పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం కోసం కామాటి వీధిలో స్థలాన్ని పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గురుకుల కిషోర్ పరిశీలించారు. తదుపరి కార్యక్రమంలో నెల్లూరు నగరానికి చెందిన ఒక కార్యకర్తకు అవసరమైన ఆపరేషన్ ఖర్చుల విషయాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సాయం అందేలా మున్సిపల్ శాఖా మాత్యులు, సిటీ ఎమ్మెల్యే పొంగూరు నారాయణ దృష్టికి తీసుకెళ్తామని పార్టీ నాయకులు హామీ ఇచ్చారు. అదే డివిజన్లో రోడ్డుపై పండ్ల వ్యాపారం చేస్తున్న పెద్దావిడకు కూటమి ఎమ్మెల్యే తరఫున ఉచితంగా పంపిణీ చేస్తున్న బండ్ల కోసం అప్లికేషన్ ను ఫార్వర్డ్ చేసి, త్వరలో బండి అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, సంయుక్త కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, 46వ డివిజన్ నాయకులు గురవయ్య, 47వ డివిజన్ జనసైనికులు కే కార్తీక్, ఏ బాలగోపాల్, టి చెంగయ్య, పురుషోత్తం, కే రమేష్, పి శ్రీనివాసులు, జి నరేష్, ఏ సుబ్రహ్మణ్యం ఆచారి, ఈ నాగూర్ ఆచారి, వి ముని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com