కావలి ( జనస్వరం ) : పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో జరిగిన జనంలోకి జనసేన కార్యక్రమంలో సిద్దు,తోట శేషయ్య, బెల్లంకొండ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కావలి నియోజకవర్గంలో అభివృద్ధి లేదని అవినీతి అరాచకాలు విపరీతంగా పెరిగిపోయాయని వచ్చే ఎన్నికల్లో నిజాయితీ పరుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఒక్క అవకాశం ఇవ్వాలని,జగన్ మోహన్ రెడ్డి మనకు ఈత కాయ ఇచ్చి తాటికాయ వసూలు చేస్తున్నారని ఇది ప్రజలు గమనించి వచ్చే ఎన్నికల్లో వైసీపీ పార్టీని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు.
ఆర్టీసి డ్రైవర్ పై దాడి చేసిన వారు జనసేన పార్టీకి ఎలాంటి సంబందాలు లేకపోయినా చిత్రీకరించే ప్రయత్నం చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎమ్మెల్యే రౌడీలుగా చెబుతున్న వారికి జనసేనలో సభ్యత్వం ఉందని నిరూపించాలని లేదంటే రాజీనామా చేస్తావా అంటూ సవాల్ విసిరారు. తాడేపల్లి వైసీపీ కేంద్రకార్యాలయంలో ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నీ అబద్ధాలే చెప్పి మభ్యపెట్టే ప్రయత్నం చేశారన్నారు. ఆర్టీసి డ్రైవర్ పై దాడి చేసిన రౌడీమూకలు కావలిలో ఏ పార్టీ జెండా కింద ఉన్నారో కావలి పట్టణ ప్రజలందరికీ తెలుసని, వాళ్ళు అధికార పార్టీ కి చెందిన వారే అని పబ్లిక్ గా చెప్పుకుంటున్నారన్నారు. నాలుగున్నర సంవత్సరాలుగా కావలి ప్రజలను మోసం చేస్తున్నారని, ఇంకా మోసం చేయాలని చూస్తే ఎవరూ నమ్మే స్థితిలో లేరన్నారు. నాలుగున్నర సంవత్సరాలుగా దళితులపై,మహిళలపై, విలేకరులపై దాడులు జరుగుతుంటే ఎమ్మెల్యే ఎందుకు స్పందించలేదన్నారు. దాడి చేసిన వారిని నీ వెంట ఎలా తిప్పుకున్నావని సిద్దు ప్రశ్నించారు. 2024 లో ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిని ప్రజలు ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని, ఓటమి భయంతోనే ఎమ్మెల్యే పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన బోగోలు మండల ప్రధాన కార్యదర్శి ఆలూరి చంటి, విద్యార్థి నాయకులు విజయ్, మనోజ్, చిన్నా,విష్ణు, సాయి, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com