సర్వేపల్లి ( జనస్వరం ) : సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లిగూడూరు మండలంలోని పేడూరు పంచాయతీ పరిధిలోని కొలిదిభ గిరిజనులకి శుక్రవారం నిత్యావసర సరుకులను సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు అందించారు. ఆయన మాట్లాడుతూ తుఫాన్ కారణంగా గిరిజనుల గుడిసెల్లోకి నీళ్లు చేరిపోయి ఉండటానికి కూడా ఇబ్బంది పడుతూ అవస్థలు పడుతూ ఉంటే వాళ్లకి నష్టపరిహారంగా 2500 కొంతమందికి కొంతమందికి ఇంకా పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందకపోవడం చాలా బాధాకరమైన విషయం అని అన్నారు. అధికారులు అధికార పార్టీ నాయకులు గిరిజనుల పైన ఎందుకు ఇంత చిన్నచూపు చివరికి తుఫాన్ బాధితులకి నష్టపరిహారం అందించడంలో కూడా కోతల రోజు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో వారికి నిత్యవసర సరుకులను ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గంలో ఎక్కడ ఎవరుకే సమస్య ఉందన్న జనసేన పార్టీ అడుగుల ముందుకు వేస్తుంది. అదే విధంగా రేపు 2024లో జనసేన తెలుగుదేశం కలిసి ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిస్తామని పేద బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగును నింపుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో వీర మహిళ గుమినేనీ వాణి భవాని, కల్లూరు కళ్యాణి సుమతి నిర్మలమ్మ సురేష్ నరసయ్య స్థానికుడు సునీల్ మండల సీనియర్ నాయకులు శరత్ తదితరులు పాల్గొన్నారు.