చిత్తూరు ( జనస్వరం ) : గంగాధర నెల్లూరు నియోజకవర్గం, పాల సముద్రం మండలం, వన దుర్గాపురం పంచాయతీలో నా సేన కోసం నా వంతు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ యుగంధర్ పొన్న హాజరై మాట్లాడుతూ మండలంలో ఉన్న జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు, అభిమానులు, సామాన్య ప్రజలు పవన్ కళ్యాణ్ ఆశయ సాధన కోసం ప్రతీ ఒక్కరూ భాగస్వాములు అవ్వాలని విజ్ఞప్తి చేశారు. నా సేన కోసం నా వంతు కార్యక్రమంలో ప్రజల కోసం అండగా ఉండే జనసేన కోసం ప్రతి ఒక్కరూ పది రూపాయల నుండి ఎంతైనా 7288040505, 7288040505@upi కి ఫోన్ పే, గూగుల్ పే, పే టియం ద్వారా పంపి, పారదర్శక పాలనకు అవకాశం కల్పించాలని తెలిపారు. జన భాగస్వామ్యం పెరిగితేనే అవినీతి అంతం అవుతుందని, జవాబు దారితనం వస్తుందని, తద్వారా జనరంజక పాలన జరుగుతుందని తెలియజేసారు. రాజకీయాల్లో క్రౌడ్ ఫండింగ్ రాజ్య మేలాలని, మండలం లో ఉన్న ప్రజలందరూ పవన్ కళ్యాణ్ కి ప్రోత్సాహం, సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. జన విరాళాలు కచ్చితంగా అందర్నీ ఐక్యమత్యంగా ఉంచు తుందని, ఎవరి పరిధిలో వారు పార్టీ నిర్వహణ కోసం ఇచ్చే విరాళాలు ఒక రకమైన భావోద్వేగం తో ముడిపడి ఉంటాయని, కొత్త వ్యక్తులు సైతం పార్టీకి అసోసియేట్ అయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమం లో మండల గౌరవ అధ్యక్షులు లతీష్, ఉపాధ్యక్షులు నవీన్, మండల కార్యదర్శి ఆకాష్, జనసైనికులు విజయ్ కుమార్, చందు, ప్రవీణ్, శరవణ కుమార్, సాయి, సుబ్రహ్మణ్యం, చందు బత్తల చందు పాల్గొన్నారు.