Logo
Date of Publish : 29 October 2023, 7:55 pm
Editor : Sake Naresh

ఉమ్మడిగా అడుగేద్దాం – జనసేన, టీడీపీ ప్రభుత్వాన్ని స్థాపిద్దాం

      తిరుపతి ( జనస్వరం ) : జనసేన, టీడీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా సమన్వయ సమావేశం సోమవారం జరగనుంది. ఈ నేపధ్యంలో ఆదివారం తిరుపతికి చేరుకున్న జనసేన పార్టీ చిత్తూరు జిల్లా పరిశీలకులు బొలిశెట్టి సత్య.. ఆ పార్టీ నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జనసేన పార్టీ బలంగా ఉందని, క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా ప్రతి జనసైనికుడు కంకణబద్దులు కావాలని పిలుపునిచ్చారు. టిడిపి నేతలతో సమన్వయం చేసుకుంటూ ఉమ్మడి కార్యాచరణతో ముందుకు వెళ్లాలన్నారు. టిడిపి నేతలతో సత్ససంబంధాలతో భవిష్యత్ కార్యాచరణకు సిద్దం కావాలన్నారు. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రతి జనసైనికుడు పనిచేయాలన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో పార్టీ పటిష్టంగా ఉందన్నారు. 66 మండలాల్లో కమిటీలు ఏర్పాటు చేశామని, బూత్ లెవల్ లో కూడా కమిటీలను పటిష్ఠం చేస్తున్నామన్నారు. టిడిపి నేతలతో కలిసి పార్టీ శ్రేణులు ఉమ్మడిగా పార్టీ అధినాయకత్వం సూచించిన కార్యాచరణ అమలయ్యేలా చూడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా తిరుపతి నగర కార్యవర్గ సభ్యులు జనసైనికులు వీరమహిళలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com