శేరిలింగంపల్లి ( జనస్వరం ) : జనసేనపార్టీ ఇంఛార్జి మాధవ రెడ్డి, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల కాపు సంఘాల నాయకులు మరియు జంట నగరాల కాపు సంక్షేమ సేవా సంఘాలక అధ్యక్షులు, సీనియర్ నాయకులు మిర్యాల రాఘవ గారిని మర్యాదపూర్వకంగా కలిసారు. రాబోయే ఎమ్మెల్యే ఎన్నికలలో జనసేన పార్టీకి మద్దతు ఇవ్వాలని, ఇచ్చి జనసేన విజయానికి దోహదం పడాలని కోరారు. శేరిలింగంపల్లిలో అన్నీ వర్గాల వారిని కలుపుతూ విజయం సాధిద్దాం అని అన్నారు. దీనికి వారు మన తెలంగాణ రాష్ట్రంలో శేరిలింగంపల్లి నియొజకవర్గంలో నున్న కాపు మరియు ఇతర కులాల వారిని కలుపుకుంటూ మరింత బలంగా పని చేయాలని, అదేవిధంగా బూత్ కమిటీలను బలంగా చేసుకోవాలి సూచనలు ఇస్తూ సానుకూలంగా స్పందించారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com