Logo
Date of Publish : 01 October 2023, 10:15 pm
Editor : Sake Naresh

గ్రామాల్లో జనసేనపార్టీ అభివృద్ధి కోసం కృషి చేద్దాం

      పాడేరు ( జనస్వరం ) : అల్లూరి సీతారామ జిల్లా పాడేరు నియోజకవర్గంలో ప్రజా సమస్యలు ధ్యేయంగా గ్రామ గ్రామాన పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న జనసేన నాయకులు. జనసేన పార్టీ పర్యటనలో భాగంగా లీగల్ ఎడ్వటైజర్ కిల్లో రాజన్, నందొలి మురళికృష్ణ, సీ.హెచ్ అనిల్ కుమార్, ఈ పర్యటనలో జనసేన పార్టీ లీగల్ ఎడ్వటైజర్ కీల్లో రాజన్ మాట్లాడుతూ, ఆదివాసీ హక్కులు, చట్టాలకి రక్షణ ఉండాలంటే జనసేన పార్టీ అధికారంలోకి రావాలని అన్నారు. అలాగే స్థానికంగా సమస్యలు పరిష్కారం అవ్వాలన్న, ఆదివాసీ మనుగడకి, అస్తిస్త్వనికి, ఆదివాసీ మహిళలకి రక్షణ కలగాలన్న, కచ్ఛితంగా జనసేన పార్టీ అధికారంలోకి వస్తేనే న్యాయం జరుగుతుంది అని తెలిపారు. అలాగే యువతికి ఉపాధి అవకాశాలు కాని,విద్య కాని వైద్యం కాని, అభివృద్ధి కాని, నెరవేర్చిన దాఖలాలు లేవు, ప్రజలుఓట్లు వేయించుకొని గద్దె ఎక్కిన తర్వాత, ఆదివాసీ జీవన మనుగడ కి విఘాతం కలిగించేలా, ఈ రొజు మనకున్నటువంటి జివో లను చట్టాలను పటిష్టంగా అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు..
              గ్రామ నిధులను దోచుకున్న ప్రభుత్వంని త్వరలోనే బుద్ది చెప్పాలని, అలాగే గిరిజన జాతిని అనగ తొక్కాలని ఈ వైసిపి ప్రభుత్వం కంకణం కట్టుకుంది.. అందుకని ఈ వైసిపి ప్రభుత్వము సాగిస్తున్న ఈ నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలని, అలాగే మన హక్కులను చట్టాలను కాపాడుకోవలసిన బాధ్యత మన మీద ఎంతైనాఉంది.అలాగే మన జనసేన పార్టీ అద్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి అయ్యే విధంగా మనమందరం జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు.. ఈ సందర్బంగా అనేక మంది యువత జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులు అయ్యి జనసేన పార్టీ తీర్థం పచ్చుకున్నారు. అలాగే జనసేన పార్టీ పాడేరు మండల అద్యక్షులు నందోలి మురళికృష్ణ మాట్లాడుతూ ఈ గ్రామంలో చాలా మందికి పింఛన్లు తొలగించారు.10 ఎకరాలు5 ఎకరాలు భూమి ఉందని కుంటుశాకులు చెప్తున్నారు.. అలాగే ఈ గిరిజన ప్రాంతాల్లో ఎన్ని ఎకరాలు భూమి వున్న, గిరిజనులు చేస్తున్న సాగులో పంట పండే పరిస్థితి లేదు, పసుపు వేసిన 10 ఎకరాలు వున్న 365 రోజులు కు 30,000 వచ్చిన రోజు లేదు. అందుకని తక్షణమే అధికారులు స్పందించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.. అలాగే మీ సమస్యల కొసం బలంగా గళం వినిపిస్తాం అని తెలిపారు.

         జనసేన పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గం ఐటీ విభాగం సభ్యులు సి.హెచ్ అనిల్ కుమార్ మాట్లాడుతూ, ఈ పర్యటనలో భాగంగా ప్రజల సమస్యల పరిష్కారం కోసం తెలుసుకున్నారు.. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్యుడికి న్యాయం జరగటం లేదు.. మంచినీటి సౌకర్యం లేదు, రోడ్డు సౌకర్యం లేక అంబులెన్స్ వచ్చే పరిస్థితి లేదు అని గర్భిణీ స్త్రీలు ఇబ్బంది పడుతున్నాం అని, అధికారులకు వినతి పత్రం సమర్పించారు... అయినప్పటికీ స్పందించని అధికారులు కరువయ్యారు.. అలాగే రేపటి తరానికి భవిష్యత్తు నేటి యువత యువతకు ఉద్యోగ అవకాశాలు లేక ఇంటికి, రైతు పనులకు పరిమితం అయ్యారు..అలాగే అంగన్వాడీ కేంద్రాలు లేక పిల్లలకు విద్య కరువైంది.. ఓట్ల కోసం మాత్రమే ప్రజల దగ్గరకు వచ్చిన అధికారులు వాళ్ల సమస్యలు నెరవేర్చడంలో ఎందుకనీ స్పందించడం లేదు.. తక్షణమే బాధితుల న్యాయం జరిగే వరకు బలంగా పోరాటం చేయడానికి సిద్దంగా ఉన్నాం అని తెలిపారు.. జనసేన పార్టీ నాయకులకు ఘన స్వాగతం పలికిన గ్రామస్తులకు దన్యవాదములు తెలిపారు.. అలాగే జనసేన పార్టీ సిద్ధాంతాలు మేనిఫెస్టో తెలియజేసి మార్పుకి శ్రీకారం చుట్టి ఈ రాక్షస పాలనకి చరమ గీతం పాడాలని,ఈ రాష్ట్రం నుండి తరిమి కొట్టాలని కొరారు..ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ లీగల్ ఎడ్వటైజర్ కిళ్లో రాజన్, జనసేన పార్టీ మండల అధ్యక్షులు నందోలి. మురళి కృష్ణ, కాకినాడ రూరల్ నియోజకవర్గం ఐటీ విభాగం సభ్యులు సి.హెచ్ అనిల్ కుమార్, బాలరాజు, సింగన్న, టీడీపీ మాజీ సర్పంచ్ మర్రి వెంకట్రావు.బింగు నాయుడు, బాసురావు, రమేష్, అప్పారావు, చంటి, సురేష్ బాబు, కిరణ్, కోటిబాబు, కృష్ణ, పేంక్షన్ తొలగించిన వృద్దులు గ్రామస్తులు,తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com