Logo
Date of Publish : 28 November 2022, 4:18 pm
Editor : Sake Naresh

2024 లో జనసేన జెండా ఎగరవేద్దాం : పెండ్యాల శ్రీలత

    అనంతపురం ( జనస్వరం ) : జనసేనపార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని చేసే దిశగా ప్రతి ఒక్కరూ పని చేయాలని రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పెండ్యాల శ్రీలత కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం జనసేనపార్టీ ఆధ్వర్యంలో నగరంలోని జనసేనపార్టీ జిల్లా మహిళా కార్యాలయంలో జనసేన పార్టీ తరుపున పోటీ చేసి టౌన్ బ్యాంక్ డైరెక్టర్ గా ఘనవిజయం సాధించిన నగర ప్రధాన కార్యదర్శి రోళ్ల భాస్కర్ కి సన్మానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జనసేనపార్టీ కార్యక్రమాల నిర్వహణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భవాని రవికుమార్, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు మురళి, జిల్లా ఉపాధ్యక్షులు జయరామిరెడ్డి, కార్యదర్శి సంజీవరాయుడు హాజరయ్యారు. ఈ సందర్బంగా సభాధ్యక్షులు పెండ్యాల శ్రీలత మాట్లాడుతూ జనసేనపార్టీ నాయకులు రోళ్ల భాస్కర్ టౌన్ బ్యాంక్ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో విజయం సాధించడం హర్షనీయమని ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో జనసేన అధ్యక్షులుపవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చేసే దిశగా ప్రతి ఒక్క నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. అనంతరం టౌన్ బ్యాంక్ డైరెక్టర్ గా నూతనంగా ఎన్నికైన రోళ్ల భాస్కర్ గారికి వారు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కోన చంద్ర శేఖర్ నగర కమిటీ సభ్యులు కమతం వెంకట నారాయణ, అంజి గారు, ఆకుల ప్రసాద్ వీర మహిళలు శ్రీదేవి, శైలజ, లక్ష్మి, శ్రావణి, యమున, అనిత, సుప్రియ నాయకులు కొండిసెట్టి ప్రవీణ్ కుమార్, చంద్రశేఖర్, వెంకటేష్, తోట ప్రవీణ్ , ప్రశాంత్ తదితరులు పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com