జనసేనాని జన్మదినం సందర్భంగా కోవిడ్ బాధితులకు ఆక్సిజన్ వెంటిలేటర్స్ దానం చేసిన లీలా కృష్ణ ఫౌండేషన్
ఇపుడు ప్రపంచం మొత్తం మానవాళి కరోనా మహమ్మారితో బాధపడుతోంది. కరోనా బాధితులకు ముఖ్యంగా ఆక్సిజన్ అవసరం. అయితే ఇపుడు మన రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులలో సరైన వసతులు కూడా లేవు. వెంటిలేటర్లు కూడా చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. అయితే జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా రాష్ట్రంలోని అన్ని జిల్లా ఆసుపత్రులలో వెంటిలేటర్లను దానం చేయాలని జనసేన నాయకులు నిశ్చయించుకున్నారు. ఈ మేరకు పశ్చిమ గోదావరి జిల్లా కైకలూరు నుండి ఒక యూనిట్ వెంటిలేటర్ నిమిత్తం 10500 రూపాయలను గొప్ప మనస్సు తో డోనేట్ చేసిన సాంబశివరావు గారికి, లీల కృష్ణ ఫౌండేషన్ వారి సౌజన్యంతో వారి యొక్క అభిమానాన్ని చాటుకున్నందుకు క్రిష్ణజిల్లా (పశ్చిమ) చిరంజీవి యువత, జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, కార్యకర్తలు, వీరమహిళలు ఆ దాతలకు ధన్యవాదములు తెలిపారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com