కడపజిల్లా ప్రొద్దుటూరులో కొత్త మార్కెట్ లో వ్యాపారస్తులకుకు ముందు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా అంగళ్ళను కూల్చి వేయడం దారుణం అని జనసేన పార్టీ నాయకులు మాదాసు మురళీ పేర్కొన్నారు. మార్కెట్ లోని వ్యాపారుల సమస్యలు లు తెలుసుకొని పరిష్కారం చూపాల్సిన బాధ్యత అధికార పార్టీదే అన్నారు. విస్మరిస్తే ఎందుకు కూలుస్తున్నారు, వారికి నోటీసులు పంపించి, సమయం ఇచ్చి చేయలే గాని ఇలా కూలదోస్తే వారి జీవనాధారం ఎలా అని ప్రశ్నించినందుకు మేము వెళితే అరెస్ట్ చేసి కేసు నమోదు చేయడం అప్రజాస్వామికం అని అన్నారు. అసలు ప్రొద్దుటూరులో ప్రజా స్వామికబద్ధంగా అధికారులు ప్రవర్తిస్తున్నట్లు లేదని కేవలం అధికార పార్టీకి ఏ జెంట్లుగా ఉన్నట్లు ప్రజల్లో కుడా అనుమానం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రజల పక్షాన నిలవాలే తప్ప అధికార పార్టీ ఏజంట్ల వ్యవహరించి వద్దన్నారు. అలా వ్యవహరిస్తే ప్రజలకోసం ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎటువంటి పోరాటాలకైనా చేయడానికి జనసేన పార్టీ వెనుకడబోదని హెచ్చరించారు.