అనంతపురము , (జనస్వరం) : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ కో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తోంది. హిందూవుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తోంది. టిటిడి కళ్యాణ మంటపాలను లీజుకు ఇవ్వాలని తీసుకున్న నిర్ణయం ఆక్షేపణేయమని జనసేన జిల్లా ఉపాధ్యక్షులు లాయర్ జయరామిరెడ్డి ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తిరుపతి తిరుమల దేవస్థానం మినిమం మెయింటెనెన్స్ తీసుకుని ప్రజాసేవ కోసం కట్టిని కళ్యాణ మంటపాలను లీజుకు ఇవ్వటం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికే రాష్ట్రంలో వైఎస్‌ఆర్సిపి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రజల సొమ్ము ఏ విధంగా దోచుకోవాలో ఆలోచిస్తోందే తప్ప.. ప్రజలకు చేసిన మేలు ఇసుమంతైనా లేదన్నారు. అసలు వైసిపిప్రభుత్వానికి దమ్ముంటే క్రిష్పియన్ చర్చిలు, ముస్లిమ్ మసీదులు, వక్స్‌బోర్డు ఆస్తులపై ఇలాంటి నిర్ణయాలను తీసుకోగలరా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్యలు చూస్తుంటే… హిందూ వ్యతిరేక చర్యలు చేపడుతున్నారన్న అనుమానం కలుగుతోందన్నారు. ముఖ్యమంత్రి, టిటిడి. చైర్మెన్ సుబ్బారెడ్డి ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కు తీసుకోవాలన్నారు. ఇలాంటి గలీజు నిర్ణయాలకు జనసేన వ్యతిరేకమని… కులాలు, మతాలను కలిపేది జనసేన మూల సిద్దాంతమన్నారు. అన్ని మతాలను సమదృష్టితో చూడాలని హితవు పలికారు. లేనిపక్షంలో ఈ వైసిపిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఉద్యమబావుటా ఎగురవవేస్తామని జనసేన జిల్లా ఉపాధ్యక్షులు కుంటిమద్ది జయరామిరెడ్డి హెచ్చరించారు.