ధర్మవరం ( జనస్వరం ) : ధర్మవరంలో మీడియాతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి Y.S జగన్ మోహన్ రెడ్డి రైతు భరోసా సభలో ఏం మాట్లాడుతున్నాడో తెలియక అయోమయ స్థితిలోకి వెళ్ళిపోయాడన్నారు. పవన్ కళ్యాణ్ గారి రైతు భరోసా యాత్ర విజయవంతం అయినప్పడి నుండి ఏదో ఒక సభ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని తిడుతున్నారు. రైతులకు మీ ప్రభుత్వంలో ఏమి చేస్తున్నారో రైతులకు బాగా తెలుస్తోందన్నారు. ఇసుకను ప్రజలకు ఫ్రీగా ఇస్తాం అన్నారు ఎంతమందికి ఇచ్చారు? ఇసుకను దోచుకుని దానితో వ్యాపారం చేస్తున్నారు, మీకు ఎవరైతే అనుకూలంగా ఉంటారో వారికి కాంట్రాక్ట్ ఇచ్చి వారితో మీరు బిజినెస్ చేస్తున్నారు. రాష్ట్రంలో రెండున్నరేళ్లలో 2112 మంది కౌలు రైతులు చనిపోతే 718 మంది మాత్రమే ఆత్మహత్యలు చేసుకున్నారని అంటారు. పవన్ కళ్యాణ్ గారు రైతుల ఇంటి దగ్గరకే వెళ్లి 1 లక్ష రూపాయలు సహాయం చేశాక కొంతమంది అకౌంట్స్ లోకి 7 లక్షలు వేసి వారికి ఎప్పుడో సహాయం చేశాం ఎవరికి పెండింగ్ లేవు అని చెప్పుకుంటారు. రైతులు, భవన కార్మికులు మీకు ఓటు వేసి నట్టేట మునిగిపోయారు. పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతులకు సహాయం చేస్తుంటే సిబిఐ దత్తపుత్రుడు జీర్ణించుకోలేక లక్షల రూపాయలు సభలు పెట్టుకొని ఈ విమర్శలు చేస్తున్నారు. 3 సంవత్సరాల్లో ఈ పథకాలు చేశాం ఆ పథకాలు చేశాం అంటూ ప్రజలను రైతులను మోసం చేశారు ఎక్కడైనా రోడ్ లు వేసారో చూద్దాం రండి రాష్ట్రంలో రోడ్లు బాగా లేక ప్రజలు తీవ్ర ఇబ్బంది చెందుతున్నారు. ప్రస్తుతం ప్రజలు సిబిఐ కేసులు లేని ముఖ్యమంత్రిని కోరుకుంటున్నారు. మీ ఎమ్మెల్యేలు ఏం విజయాలు సాధించాలని గడపగడపకు వెళ్ళమన్నారు, కొన్ని గ్రామాల్లో మీ ఎమ్మెల్యే లను తరిమి తరిమి కొట్టారు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే కుల,మత అని తేడా లేకుండా మేము అందరినీ సమానంగా చూస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గొట్లూరు దాసరి రామాంజనేయులు,మత్స్యకార వికాస విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెస్త శ్రీనివాసులు, పట్టణ నాయకులు అడ్డగిరి శ్యామ్ కుమార్, ధర్మవరం రూరల్ మండల కన్వీనర్ D.నాగ సుధాకర్ రెడ్డి, జిల్లా సంయుక్త కార్యదర్శి దూది జయ రామాంజనేయులు, నాయుడు నాయక్, కోటికి రామాంజి, పేరూరు శ్రీనివాసులు, బండ్ల చంద్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com