అనంతపురం, (జనస్వరం) : అనంతపురం జిల్లాలోని 14 నియోజకవర్గాల వాల్మీకి ముఖ్య నాయకులు అందరూ కలిసి వెనుకబడిన వాల్మీకి కులాన్ని ST లోకి చేర్చేలా ప్రయత్నించాలని అలాగే ఈ విషయం జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్లాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు PAC సభ్యులు శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి గారికి వాల్మీకి ముఖ్య నాయకులు అందరూ కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ విషయం మీద చిలకం మధుసూదన్ రెడ్డి గారు మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మొన్న కొత్తచెరువుకి వచ్చినప్పుడు వాల్మీకుల గురించి మాట్లాడడం జరిగిందన్నారు. అలాగే కులవృత్తి లేని కుటుంబాలను ఈ ప్రభుత్వం ప్రోత్సహించాలని పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ కూడా చేయడం జరిగిందన్నారు. ఖచ్చితంగా వీరు చెప్పినవన్నీ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తానని శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు అంకే ఈశ్వరయ్య గారు, రాప్తాడు ఇంఛార్జ్ సాకే పవన్ కుమార్ గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి రామాంజనేయులు గారు మరియు వెంకటేష్, రమేష్, శివయ్య, తలారి నాగేంద్ర, చంద్రశేఖర్, గోపాల్, దేవేంద్ర, వంశీ, సురేష్, అజయ్, ప్రతాప్, ఆదిశేషు, నరేష్, శివయ్య, వంశీ, భాస్కర్, మరియు తదితరులు పాల్గొన్నారు.