ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసిన నాయకులు : అవనిగడ్డ జనసైనికులు
లక్ష్మీపురం వికలాంగుల కాలనీలో వర్షపు నీరు చేరి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అంగన్ వాడీ కేంద్రం, ఇళ్ళు చుట్టూ వర్షపు నీరు చేరి ప్రజలు నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వలన వర్షపు నీరు కదలడం లేదు. ఇప్పడికైనా అధికారులు స్పందించి సరైన డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేసి, వర్షపు నీరుని తొలగించే ప్రయత్నం చెయ్యాలని జనసేన పార్టీ నాయకులు, స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మడమల రంజిత్ కుమార్, సూదాని నందగోపాల్ మరియు స్థానికులు పాల్గొన్నారు.