Logo
Date of Publish : 05 August 2022, 8:30 am
Editor : Sake Naresh

ఆలూరు నియోజవర్గం అభివృద్ధిని గాలికి వదిలేసిన వైసీపీ నాయకులు నాయకులు : ఎరుకుల పార్వతి

          ఆలూరు ( జనస్వరం ) : గాలి మాటలు చెప్పి గాలికి వదిలేశారని జనసేన వీరమహిళ ఎరుకుల పార్వతి అన్నారు. ఆమె మాట్లాడుతూ  ఆలూరు నియోజవర్గంలో చుట్టుపక్కల గ్రామాల్లో నుండి ప్రభుత్వ ఆసుపత్రికి రావాలన్నా రోడ్డు సౌకర్యం లేకపోవడంతో నిండు గర్భిణీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. గడప గడప కార్యక్రమంలో అభివృద్ధి చేశామని చెబుతున్నారు తప్ప ఎక్కడా అభివృద్ధి కనిపించడంలేదని అన్నారు. ఆలూరు మండలంలో చుట్టుపక్కల గ్రామాల్లో ప్రతి వార్డులో సమస్యలు ఉన్నాయని మరి నాయకులకు కనిపించడం లేదా అని ఘాటుగా విమర్శించారు. కొన్నిచోట్ల సిసి రోడ్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మురికి నీరు రోడ్లపై నిలచడం వల్ల గ్రామ ప్రజలకు డెంగ్యూ మలేరియా వంటి విశ్వజ్వరాలు వస్తున్నాయన్నారు. బ్లీచింగ్ పౌడర్ కూడా గ్రామంలో సరిగా చల్లడం లేదని కొన్ని చోట్ల డ్రైనేజీ కాలవలు ఉన్నప్పటికీ ఆ డ్రైనేజీ కాలువలు కూడా నిండిపోయిన పట్టించుకోవట్లేదని అన్నారు. ఇక్కడున్న నాయకులు పదవుల కోసం పాకులాడుతున్నరే తప్ప ప్రజల సమస్యలపై స్పందించడం లేదు. ఇప్పటికైనా ప్రజల సమస్యలపై స్పందించాలని కోరుకుంటున్నానని అన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com