విశాఖపట్నం ( జనస్వరం ) : 85వ వార్డు మంత్రి పాలెం గ్రామంలో 2 పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం చేసిన పెందుర్తి జనసేన నాయకురాలు గొన్న రమాదేవి మరియు 85వ వార్డు జనసేన నాయకులు దాసరి త్రినాథ్. గత రెండు నెలలుగా యాక్సిడెంట్ కారణంగా తన చెయ్యి విరిగిపోవడం వలన ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి బలిరెడ్డి సంతోష్ కుమార్ కుటుంబానికి మరియు గత మూడు నెలలుగా కిడ్నీ మరియు హృదయ సంబంధిత వ్యాధి వలన ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి షేక్ నాగూర్ కుటుంబానికి ఈరోజు పెందుర్తి జనసేన నాయకురాలు గొన్న రమాదేవి గారు పదివేల రూపాయలు మరియు 85వ వార్డు జనసేన నాయకులు దాసరి త్రినాథ్ గారు 5000 రూపాయలు మరియు మంత్రి పాలెం జనసైనికులు పచ్చికోరు శ్రీనివాసరావు యూఎస్ఏ పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో కరణం పెంటారావు, అట్ట అప్పారావు, గొన్న హర్ష, చంద్రపాటి దుర్గారావు, దాసరి శ్రీను డాన్, గొల్లవిల్లి శ్రీనివాసరావు, మడక నూకరాజు, సేనాపతి మణికాంత్, సేనాపతి మహేష్, సేనాపతి శ్రీను, మడక బాబ్జి, అల్లుమల్ల రాము, గొలగాని కుమార్, గెంజి శ్రీను, మడక వీర, మరియు మంత్రి పాలెం జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com