తిరుపతి, ఏప్రిల్ 07 (జనస్వరం తిరుపతి షాదిఖానాలో నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో కూటమి అభ్యర్థి అరణి శ్రీనివాసులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు m పసుపులేటి హరిప్రసాద్ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్, టీడీపీ సీనియర్ నాయకులు కోడూరు బాలసుబ్రమణ్యం ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన రాష్ట్రం బాగుండాలంటే కచ్చితంగా కూటమి గెలవాలని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీలలో ఒక మార్పు మొదలై మన భవిష్యత్తు కోసం నిజాయితీపరుడైనటువంటి పవన్ కళ్యాణ్, చంద్రబాబుని కేంద్రంలో మోడీని గెలిపించుకోవాలని తెలిపారు. ఏ రాష్ట్రం ఒక బ్యాంకు లాంటిది మన రాష్ట్రానికి ఒక నిజాయితీపరులు సీఎం అయితే రాష్ట్రము రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఆనందంగా ఉంటారు. ముస్లింల అభివృద్ధి జనసేన పార్టీ టీడీపీ బీజేపీ లతోనే సాధ్యం అని తెలియచేసారు. తిరుపతి ఉమ్మడి అభ్యర్థి అరణి శ్రీనివాసులుని అత్యంత మెజారిటీతో గెలిపించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలియజేశారు. అలాగే ముస్లిం సోదరులకి అండగా జనసేన ఉంటుంది అని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, టీడీపీ నాయకులు, ముస్లిం సోదరులు అందరూ పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com