శ్రీకాళహస్తి ( జనస్వరం ) : జనసేన నియోజకవర్గ ఇంచార్జ్ వినుత కోటా ఇంటింటికీ ప్రచారంలో భాగంగా తొట్టంబేడు మండలం, ఇలగనూరు హరిజనవాడలో పర్యటించినప్పుడు కోటమ్మ, రవనయ్య అనే ఒక నిరుపేద కుటుంబం కనీసం ఇళ్లు కూడా లేక రోజు గడవడం ఇబ్బంది అని తెలపడం జరిగింది. వినుత ఆదేశాల మేరకు మండల ప్రధాన కార్యదర్శి పేట చంద్ర శేఖర్, జనసేన నాయకులు ఒక నెలకి సరిపడా నిత్యావసర వస్తువులు, బియ్యం ఆ నిరుపేద కుటుంబానికి వితరణ చెయ్యడం జరిగింది. జనసేన ప్రభుత్వం వచ్చిన వెంటనే పక్క ఇళ్లు నిర్మిస్తామని భరోసా కల్పించడం జరిగింది. జోరు వానలో కూడా ఆ గ్రామానికి వెళ్లి కోటమ్మ కుటుంబాన్ని ఆదుకున్న జనసేన నాయకులకు ఆ గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తొట్టంబేడు మండల ప్రధాన కార్యదర్శి పేట చంద్ర శేఖర్ ,నియోజకవర్గ ఐటీ కోఆర్డినేటర్ కావలి శివకుమార్, పట్టణ ఉపాధ్యక్షులు తోట గణేష్, ప్రధాన కార్యదర్శి పేట చిరంజీవి, నాయకులు గురవయ్య, జ్యోతి రామ్, హేమంత్, దినేష్, రాజేష్, సురేష్, జనసైనికులు గురుస్వామి, భాను, నరేంద్ర, మదు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com