శింగరాయకొండ, (జనస్వరం) : మండలంలోని శింగరాయకొండ పంచాయతీలో బుంగబావి కాలనీలో ఉన్నట్టు వంటి యార్లగడ్డ బాజీ యువకుడు గతంలో కరెంట్ పోల్ మీద నుండి కింద పడి వెన్ను ఎముక దెబ్బతిన్న సంగతి అందరికీ తెలిసిందే అతను మన జనసేనపార్టీని ఆర్థిక సహకారం కోరారు. ఇందుకు సంబంధించిన మన జనసేన నాయకులు, కార్యకర్తలు యార్లగడ్డ బాజీకి వారు నిత్యావసర సరుకుల అందించారు. ఇందులో పాల్గొన్న జనసేన నాయకులు రాణా, ఆంజనేయులు, కళ్యాణ్, రాజేంద్ర సాయి, వినయ్, కుమార్, మహేష్, శీలం సాయి, నాగార్జున, సుభాని, నిఖిల్, ప్రవీణ్, అవినాష్, జన సైనికులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com