సర్వేపల్లి ( జనస్వరం ) : బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గానికి ఎంతోమంది నాయకులై ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ఎంపీలుగా ఎదుగుతున్నారే గాని, సర్వేపల్లి నియోజకవర్గంలోని సర్వేపల్లి గ్రామంలో ఎన్నో ఏళ్ల నుంచి సమస్యలు, సమస్యలుగానే ఉన్నాయి. ఒక సమస్య కూడా పూర్తిగా పరిష్కరించిన దాఖలాలు. అదేవిధంగా ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలోని ఐదు కులాల వినియోగించుకునేటువంటి స్మశానం మంగలి, కుమ్మరి, చాకలి, యాదవ, బలిజ ఐదు కులాల వారు వినియోగించుకునే కొత్తగుంట స్మశాన వాటిక వర్షాకాలంలో వర్షం నీటితో నిండిపోతే శవాన్ని తీసుకెళ్లి పూడ్చుకోవాలంటే ఎంతో ఇబ్బంది మోకాల్లోకి నీళ్ళల్లో వెళ్లి ఎక్కడ గట్టు కనిపిస్తే అక్కడ కూర్చునే పరిస్థితి. ఈ విషయంపై ఎన్నోసార్లు ప్రభుత్వ అధికారులకు తెలియజేశాం. ఎక్కడా కూడా ఎవరు కూడా పూర్తిస్థాయిలో స్పందించిన దాఖలాలు లేవు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో స్పందనలో ఈరోజు మళ్లీ అర్జీ ఇవ్వటం జరిగింది. ఈ సమస్య ఒక 15 రోజుల లోపల పరిష్కారానికి ప్రభుత్వం మార్గం చూపకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేసే దానికి జనసేన పార్టీ సిద్దంగా ఉంది. అదేవిధంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచల మండలంలో కోట్ల రూపాయల గ్రావెల్ మాఫియా దందా కొనసాగుతుంటే ఈరోజు స్మశానానికి గ్రామీణ తోలుకోమని ఎన్నోసార్లు అధికారులకు తెలియజేస్తే ఎవరు కూడా పట్టించుకునే స్థితిలో లేరు. కానీ గ్రావెల్ తవ్వకాలకుమాత్రం పర్మిషన్లు వస్తున్నాయి. వాళ్లు మాత్రం కోట్ల రూపాయలు దోచుకునే దానికి మాత్రం అధికారులందరూ కూడా ప్రోత్సహిస్తున్నారే తప్ప మా సమస్యను వినండి అయ్యా ఈ సమస్యను పరిష్కరించండి. ఎక్కడా కూడా పరిష్కరించిన దాక రాలేవు. ఒకవైపు చూస్త రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గోవర్ధన్ రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గం వదిలి చేసినట్టు ఆయన ఏదో పూర్తిగా అభివృద్ధి చేసినట్టుగా డప్పు కొట్టుకుంటున్నాడు. రేపు 2024లో ఆయన ఇంటికి పంపించడం తద్యం జనసేన పార్టీ విజయకేతనం ఎగరవేస్తాం. సర్వేపల్లి నియోజకవర్గంలో అని చెప్పి మీడియా పూర్వకంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు రహీం, శ్రీహరి, వెంకీ, పెంచల నరసయ్య, సుమన్, తదితరులు పాల్గొన్నారు