
రాజాం, (జనస్వరం) : రాజాం నియోజకవర్గంలోని రోడ్లు దుస్థితి పై రాజాం నియోజకవర్గం జనసేన నాయకులు ఎన్ని. రాజు ఆధ్వర్యంలో రోడ్లు వెయ్యండి – ప్రజలు ప్రాణాలు కాపాడండి అంటూ సంఘీభావ దీక్ష చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆముదాలవలస నియోజకవర్గ ఎంపీటీసీ సిక్కోలు.విక్రమ్ పాల్గొని దీక్షకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా విక్రమ్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రధాన రహదారులు, అంతర్గత రోడ్లు తీవ్రంగా దెబ్బతిని గోతులమయంగా మారాయని తెలియజేసారు. ప్రజలు గోతులు పడ్డ రోడ్ల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే రోడ్లకు మరమ్మతులు చేయించి అవసరమైన ప్రతి ప్రాంతం నందు నూతన రోడ్ల నిర్మాణం చేపట్టవలసిందిగా కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జిల్లా నియోజకవర్గ నాయకులు దీక్షలో పాల్గొన్నారు.