పత్తికొండ ( జనస్వరం ) : పత్తికొండ నియోజకవర్గంలో పత్తికొండ మండలంలో ఉన్న వివిధ గ్రామాల్లో ఉన్న జనసేన పార్టీ నాయకులు, సిజి రాజశేఖర్ ఇంటి దగ్గరికి వెళ్లి పత్తికొండ నియోజకవర్గ తెలుగుదేశం జనసేన పార్టీ సమన్వయకర్త నిర్వహణ బాధ్యతలు రాజశేఖర్ గా అప్పజెప్పడంతో వారి ఇంటి దగ్గర పత్తికొండ మండలంలో ఉన్న వివిధ గ్రామాల నాయకులు సన్మానం కార్యక్రమం చేశారు. సిజి రాజశేఖర్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నాకు అప్పచెప్పిన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తానని, నాపై అధ్యక్షులవారు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు. జనసేన పార్టీ బలపేతం కోసం గ్రామస్థాయి నుండి బలపరుస్తామని, నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని కలుపుకొని ముందుకు వెళ్తానని అన్నారు. టిడిపి నాయకులతో కలిసి కార్యక్రమాలు చేపట్టి, పత్తికొండ నియోజకవర్గంలో, జనసేన టిడిపి పార్టీల ఉమ్మడి అభ్యర్థి 2024లో గెలుపు కోసం, మేము కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ నాయకులు, ఇస్మాయిల్, వడ్డే విరేష్, ఎర్రి స్వామి, అనిల్, చాంద్ బాషా, ధనంజయ, రవి, రమేష్, ప్రదీప్, కాశీనాథ్, హరి, నెట్టికల్, మరియు తదితరులు పాల్గొని సన్మాన కార్యక్రమం చేశారు.